చైనా చదువులకు ఇక విలువలేదు.. యుజిసి క్లారిటీ .

    0
    57

    చైనాలో చదువులపై మన దేశం విద్యార్థులకు ఓ ముఖ్యమైన హెచ్చరిక చేసింది.. చైనా లో చదివే మెడిసిన్ ,ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ తదితరులు ఆన్ లైన్ కోర్సులకు భారతదేశంలో విలువ లేదని వాటిని గుర్తించే సమస్య లేదని యుజిసి స్పష్టం చేసింది. భారతదేశం నుంచి అనేకమంది గతంలో చైనాలో మెడిసన్ ,మేనేజ్మెంట్, ఇంజనీరింగ్ కోర్సులకు వెళ్లేవారు. అయితే కరోనా లాక్‌డౌన్‌ కాలం నుంచి చైనాకు వీసా నిబంధనలు, రాకపోకలపై కఠినమైన ఆంక్షలు ఉన్నాయి.

    దీంతో చైనాలోని యూనివర్సిటీలు మెడిసన్ తో సహా ఇతర కోర్సులకు ఆన్లైన్ చదువులకు అవకాశం ఇస్తున్నట్టు ప్రకటించాయి. అయితే మెడిసిన్ ఇంజినీరింగ్ లాంటి కోర్సులను ఆన్లైన్లో చదివితే అనుమతించే ప్రశ్నే లేదని యుజిసి స్పష్టంచేసింది . ఇటీవల కాలంలో చైనా లోని యూనివర్సిటీలు ప్రకటనలు జారీ చేస్తున్నాయి. ఆన్లైన్ కోర్సులకు ప్రవేశం అంటూ విద్యార్థులను ఆకర్షిస్తున్నాయి , అయితే ఆన్లైన్ కోర్సులు చదివే విద్యార్థుల సర్టిఫికెట్ ను అనుమతించే ప్రశ్నే లేదని యుజిసి స్పష్టం చేసింది..

    ఆన్ లైన్ చదువుల ద్వారా వచ్చే సర్టిఫికెట్ అడ్డం పెట్టుకుని ఉద్యోగాలుకు , ఉన్నత చదువులుకు కానీ భారతదేశంలో అవకాశం లేదని చెప్పింది. ఇది కాకుండా ఇండియన్ మెడికల్ కౌన్సిల్ కూడా చైనాలో ఆన్లైన్ మెడిసిన్ కోర్సులపై ఒక వివరణ ఇచ్చింది . ఆన్లైన్ మెడికల్ కోర్సులు చదివిన వారికి మన దేశంలో వైద్యులుగా ప్రాక్టీస్ చేసుకునేందుకు అనర్హులంటూ స్పష్టం చేసింది.

    అందువల్ల విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా చైనా ఆన్లైన్ చదువులకు దూరంగా ఉండాలని కోరింది . చైనాలోని యూనివర్సిటీల్లో నేరుగా చదువుకునే అవకాశాలు ఇప్పుడిప్పుడే లేవని ,సమీప భవిష్యత్తులో ఉండబోవని కూడా స్పష్టం చేసింది . చైనా నిబంధనలు మరింత కఠినం చేసిందని కరోనా నేపథ్యంలో ఇప్పుడిప్పుడే వాటిని సడలించే అవకాశం లేదని కూడా యుజిసి స్పష్టం చేసింది .. అందువల్ల విద్యార్థులు శ్రేయస్సు దృష్ట్యా ఆన్లైన్ చదువులు ప్రకటనకు ఆకర్షితులై ఇబ్బందులు పడవద్దని కోరింది..

     

    ఇవీ చదవండి… 

    అందమైన ఒంటె రెండు కోట్లు గెలిచింది..

    నాగచైతన్యను మరోసారి బాధపెట్టిన సమంత..!

    చీకేసిన మామిడిముట్టి లాంటి తలకి మళ్లీ హెయిర్ స్టైలిస్టు కావాలా..?

    సోనూ సూద్, గౌతమ్ రెడ్డి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటన్నారో..