సొంత గూటికి ఏనుగులు.డ్రోన్లు, విమానాలు, శాటిలైట్ ట్రాకింగ్.

  0
  25

  ఏనుగుల ఆవాసం, సహజీవనం ఇప్పటికీ పరిశోధనలకు చిక్కడంలేదు. చైనాలోని యునాన్ ప్రాంతం నుంచి తప్పించుకుపోయిన ఏనుగులు, మళ్లీ 17 నెలల తర్వాత స్వస్థలాలకు చేరుకున్నాయి. వీటిని స్వస్థలాలకు తరలించేందుకు డ్రోన్లు, విమానాలు, శాటిలైట్ ట్రాకింగ్.. ఇలా అనేక రకాలుగా వాటికి దారి చూపించి, చివరకు వాటి స్వస్థలాలకు చేర్చారు.

  14 ఆసియా ఏనుగుల ఈ గుంపు 8వతేదీ నాటికి తమ స్వస్థలాలకు వెళ్లే క్రమంలో ఓ నదిని దాటిన తర్వాతనే అధికారులు వాటిని వదిలేశారు. 17నెలల పాటు వాటి గమనం అలాగే సాగిపోయింది. ఈ మొత్తం ఏనుగులు మళ్లీ స్వస్థలాలకు చేరేందుకు 807 మైళ్లు వెనక్కు ప్రయాణం చేశాయి.

  ఈ ప్రయత్నంలో ఏనుగుల వల్ల ప్రజలు ఇబ్బంది పడకూడదని 1 లక్ష 50వేలమంది ప్రజలను గ్రామాలనుంచి ఖాళీ చేయించారు. ఈ ఏనుగుల వల్ల కలిగిన నష్టాన్ని 6కోట్ల రూపాయలను నష్టపరిహారంగా వారికి చెల్లించారు. ఇవి క్షేమంగా చేరేందుకు నదులపై 8 చోట్ల తాత్కాలికమైన బ్రిడ్జిలు కట్టారు. ఇలా దాదాపు 17 నెలలపాటు వాటి గమనాన్ని ట్రాక్ చేస్తూ వాటిని సొంత ప్రాంతానికి తరలించేశారు.

  ఇవీ చదవండి..

  ఊపిరి తిత్తులు చెప్పే వాక్సిన్ అసలు రహస్యం..

  బ్లూటూత్ పేల‌డం ఎప్పుడైనా విన్నారా ?

  ఒలింపిక్ విజేత మీరాబాయి కన్నీళ్లతోఇలా..

  శ్రీదేవి రెండో కుమార్తె ఖుషీ కపూర్ అక్క జాన్వీకి పోటీ వస్తోంది..