ఆ బీచ్ లో కారు డ్రైవ్ చేసి అరెస్టయ్యాడు..

    0
    179

    గోవాలో ఆ బీచ్‌లో డ్రైవింగ్ చేస్తే…
    అరెస్ట్ చేస్తారు… ఎందుకో తెలుసా ?
    ==============
    గోవాలోని మోర్జిమ్ బీచ్‌లో కారులో డ్రైవింగ్ చేసినందుకు ఓ యువ‌కుడిని పోలీసులు అరెస్టు చేశారు. అత‌ని కారుని సీజ్ చేశారు. చెన్నైకి చెందిన సందీప్ కుమార్ అనే యువ‌కుడు కారులో మోర్జిమ్ బీచ్ లో డ్రైవింగ్ చేశాడ‌నే కార‌ణంతో అరెస్టు చేసిన‌ట్లు పోలీసులు తెలిపారు. బీచ్ లో డ్రైవింగ్ చేస్తే అరెస్టు చేస్తారా ? అనే క‌దా మీ డౌట్‌. మామూలు రోజుల్లో అయితే అరెస్టు చేయ‌రు. కానీ నిషేధిత స‌మ‌యంలో కారు డ్రైవ్ చేశాడు కాబ‌ట్టి అరెస్టు చేశారు.

    అస‌లు ఎందుకు నిషేధిత స‌మ‌యం విధించారో తెలుసా ? తాబేళ్ళ కోసం… వాటి సంత‌తి ఉత్ప‌త్తి కోసం.. మోర్జిమ్ బీచ్ లో ఆలీవ్ రిడ్లే తాబేళ్ళు ఈ సీజ‌న్ లో తీర ప్రాంతానికి ల‌క్ష‌లాదిగా త‌ర‌లివ‌స్తాయి. గుడ్లు పెట్టి వాటిని ఇసుక తిన్నెల్లో దాచి పెడ‌తాయి. గుడ్లను పొదుగుతాయి. ఆ స‌మ‌యంలో బీచ్ ప‌రిస‌ర ప్రాంతాల్లో ఎవ‌రినీ.. తాబేళ్ళ ర‌క్షిత ప్రాంతంలోకి అడుగు పెట్ట‌నీయ‌కుండా నిషేధాజ్ఞ‌లు జారీ చేస్తారు. అవి గుడ్లు పొదిగిన త‌ర్వాత పిల్ల‌లైన చిన్న తాబేళ్ళ‌ను తీసుకుని సముద్రంలో వెళ్ళే వర‌కు ఈ నిషేదాజ్ఞ‌లు అమ‌లులో ఉంటాయి.

    అయితే సందీప్ కుమార్ గోవా టూర్ కి వ‌చ్చి, మోర్జిమ్ బీచ్ లో దిగాడు. త‌న కారుతో నిషేధిత ప్రాంత‌మైన ప్ర‌దేశంలో డ్రైవింగ్ చేశాడు. ఆ వీడియోని త‌న సోష‌ల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసుకున్నాడు. అది షేర్లు కొట్టుకుంటూ గోవా పోలీసుల వ‌ర‌కు వెళ్ళింది. వెంట‌నే సీన్ లోకి దిగిన పోలీసులు… సందీప్ ను ట్రేస్ చేసి, అరెస్ట్ చేయ‌డంతో పాటు కారును సీజ్ చేశారు.

     

    ఇవీ చదవండి

    పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

    ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

    పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

    తిరుమల నామాల పార్కులో కోడె నాగు.