మళ్ళీ దంచికొట్టే వానలు, దక్షిణ కోస్తాపై కాటు.

  0
  231

  అల్పపీడనం సరిగ్గా శ్రీలంక ఉత్తర భాగం మీదుగా కొనసాగుతోంది. దీని ప్రభావం వల్ల బంగాళాఖాతంలో నుంచి బలమైన మేఘాలను మన ఆంధ్రప్రదేశ్ దక్షిణ భాగాల మీదుగా వదులుతోంది. దీంతో వర్షాలు ఈ రోజు నుంచి పెరుగుతాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి ప్రస్తుతానికి శ్రీలంక దక్షిణ భాగాల్లో ఉంది. ఆ అల్పపీడనం మెల్లగా ఉత్తర వాయువ్య దిశగా కదులుతోంది. రానున్న ఇరవై నాలుగు గంటల్లో ఇది బలపడి తీవ్ర అల్పపీడనంగా మారనుంది. ఈ అల్పపీడనం ఈ నెలలో వచ్చిన అల్పపీడనాలు లాగ కాదు. కాస్త భిన్నంగా ఉత్తర దిశగా ఎక్కువ మేఘమాల ఏర్పడుతున్నట్టు కనిపిస్తోంది. ఇది వాయుగుండంగా మారదు కానీ బలమైన అల్పపీడనంగా శ్రీలంక ఉత్తర దిశగా కదలనుంది. దిని వల్ల ఆ మేఘాల సమూహం బెల్ట్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దక్షిణ భాగాల్లో పడనుంది కాబట్టి భారీ వర్షాలు విస్తారంగా పడనున్నాయి. నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, కడప జిల్లాలు చాలా అపమత్తంగా ఉండాలి. ఈ అల్పపీడనం మెల్లగా ఆ అండమాన్ దీవుల దగ్గర ఉన్న భారీ మేఘాలను తీసుకొని మన రాష్ట్రం దక్షిణ భాగాల పై వదలనుంది. నవంబర్ 27 న మెళ్లగా నెల్లూరు జిల్లాలో వర్షాలు మొదలౌతాయి. నవంబర్ 28 నుంచి డిసెంబర్ 2 దాక తీవ్రమైన వర్షాలు నెల్లూరు, చిత్తూరు-తూర్పు, ప్రకాశం, కడప జిల్లాల పై పడనున్నాయి. దీని వల్ల వరద మరింత ఎక్కువౌతుంది. కొన్ని చోట్ల ప్రత్యేకించి నెల్లూరు జిల్లాలో అతితీవ్రమైన వర్షాలు పడనున్నాయి.

   

  ఇవీ చదవండి

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.