పగలు మహిళలు.. రాత్రి పురుషులు..

    0
    3203

    పగటిపూట మహిళల వేషంలో ఆ ఏరియా అంతా జల్లెడపడతారు. మహిళల వేషం వేసుకుని, దుప్పట్లు కప్పుకుని బొమ్మలు విక్రయిస్తున్నట్లుగా కాలనీలలో కలియదిరుగుతారు. పెద్ద పెద్ద ఇంళ్లు, బాల్కనీ లో విలువైన వస్తువులు లేదా బట్టల్ని చూస్తూ, వాటి ఆధారంగా ఖరీదైన ఇళ్లు ఏవి అనే విషయాన్ని గ్రహిస్తారు. రాత్రికి తమ అసలు రూపం బయటపెడతారు. మహిళల వేషాలు తీసేసి, పురుషులుగా మారిపోతారు. అర్ద రాత్రి దాటిన తర్వాత నగరం మొత్తం నిద్రపోతున్న సమయంలో చెడ్డీగ్యాంగ్ కాలనీలోకి ప్రవేశిస్తుంది. శబ్దం కూడా రాకుండా చెప్పులను చేత పట్టుకోవడం లేదా నడుముకి కట్టుకోవడం వంటివి చేస్తారు. ఇనుప రాడ్ తో ఎలాంటి శబ్దం రాకుండా తాళం పగులగొట్టి అందినకాడికి దోచుకో పోతారట. అందుకే ఇలాంటి వారు ఎవరైనా కనిపిస్తే జాగ్రత్తగా ఉండాలని పోలీసులు చెబుతున్నారు. ఒకవేళ ఇంట్లో ఎవరైనా ఉంటే, వారిని చంపేసి మరీ దోచుకెళ్లేంత కిరాతకులు ఈ చెడ్డీగ్యాంగ్ సభ్యులు.

    చెడ్డి గ్యాంగ్.. ఈ పేరు చెబితే చాలు హైదరాబాద్ నగర వాసులు అందరి వెన్నులో వణుకు పుడుతుంది. ఎందుకంటే ఈ గ్యాంగ్ చేసే దొంగతనాలు ఆ రేంజిలో ఉంటాయి కాబట్టి. ఇంటికి తాళం వేసి కాస్త బయటికి వెళ్లారు అంటే చాలు ఇక ఇంటికి వచ్చేసరికి ఇల్లు అక్కడే ఉంటుంది కానీ ఇంట్లో ఉన్న విలువైన సామాన్లు మాత్రం ఎక్కడా కనిపించవు. అయితే పోలీసులు ఈ గ్యాంగ్ పట్టుకునేందుకు ఎంత నిఘా ఏర్పాటు చేసినప్పటికీ ఏదో ఒక విధంగా తప్పించుకుంటూ చోరీలకు పాల్పడుతునే ఉంది ఈ గ్యాంగ్ ప్రస్తుతం దొంగతనాలకు పాల్పడే ఈ గ్యాంగ్ మోస్ట్ వాంటెడ్ లిస్టులో కొనసాగుతోంది పోలీసులు ఇక వీరిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి రంగంలోకి దిగిన వీరు మాత్రం ఇప్పటివరకు పోలీసులకు చిక్కలేదు.

    ఇవీ చదవండి..

    ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

    అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

    అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

    నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?