ఓటుకు నోటు కేసులో చంద్ర‌బాబుకు బిగ్ రిలీఫ్‌.

    0
    64

    తెలుగురాష్ట్రాల్లో ఓటుకు నోటు కేసు సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు పేరు కూడా రావడం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. అయితే, ఈ కేసులో చంద్రబాబుకు ఊరట లభించింది. ఈరోజు ఈ కేసుకు సంబంధించి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి (అప్పట్లో టీడీపీ ఎమ్మెల్యే) పై ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. రేవంత్ పై మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. అయితే, ఈ ఛార్జ్ షీట్ లో చంద్రబాబు పేరును మాత్రం ఈడీ పేర్కొనలేదు. దీంతో, చంద్రబాబుకు ఊరట లభించినట్టయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో స్టీఫెన్ సన్ కు రేవంత్ రెడ్డి రూ. 50 లక్షలు ఇచ్చినట్టు తెలంగాణ ఏసీబీ తన ఛార్జ్ షీట్ లో పేర్కొంది.

    మండలి ఎన్నికల సందర్భంగా, నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ తో రేవంత్ రాయబారాలు నడిపిపట్టుగా ఏసీబీ పేర్కొంది. స్టీఫెన్ సన్ ను డబ్బుతో ప్రలోభాలకు గురి చేసే ప్రయత్నం చేసినట్టు రేవంత్ పై ఆరోపణలు చేసింది. ఈ అంశానికి సంబంధించి చంద్రబాబుతో రేవంత్ సంభాషించినట్టు కాల్ రికార్డులు బయటకు వచ్చినప్పటికీ… ఆ ఆడియోపై ఇంతవరకు ఎలాంటి క్లారిటీ రాలేదు. ఫోరెన్సిక్ విభాగం కూడా ఇంత వరకు అది చంద్రబాబు గొంతేనని నివేదిక ఇవ్వలేదు. తాజాగా దీనికి సంబంధించిన కేసులో చంద్రబాబు పేరును ప్రస్తావించకుండా ఈడీ ఛార్జ్ షీట్ నమోదు చేయడం గమనార్హం.

    ఇవీ చదవండి..

    ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

    కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

    ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

    ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..