టిడిపిలో జూనియర్ క్రేజ్, అందుకే వర్ల అలా.

  0
  825

  జూనియర్ ఎన్టీఆర్ వెనక తెలుగుదేశం పార్టీ మళ్లీ పెద్ద కుట్ర మొదలు పెట్టింది. రాజకీయంగా ఎవరు ఏమనుకున్నా, ఎన్ననుకున్నా.. వర్ల రామయ్యను అడ్డం పెట్టుకుని జూనియర్ ఎన్టీఆర్ ను కుట్రదారుల జాబితాలో చేర్చేందుకు మళ్లీ ప్రయత్నాలు చేసింది. నారా భువనేశ్వరిపై వైసీపీ నాయకులు చేశారని భావిస్తున్న వ్యాఖ్యలపై చంద్రబాబు మీడియా సమావేశంలో ఏడవడం దానిపై ఎన్టీఆర్ కుటుంబం మొత్తం స్పందించడం అందరికీ తెలిసిందే. అయితే ఈ స్పందనలో జూనియర్ ఎన్టీఆర్ స్పందించిన తీరే సోషల్ మీడియాలో కానీ, మీడియాలో కానీ ప్రముఖంగా ప్రస్తావనకు వచ్చింది.

  సోషల్ మీడియా మొత్తం జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యలనే ప్రచారం చేసింది. దీంతో జూనియర్ ఎన్టీఆర్ పేరు మళ్లీ రాజకీయంగా ప్రచారంలోకి రావడం, తెలుగుదేశం వర్గాల్లో మళ్లీ జూనియర్ ఎన్టీఆర్ కి క్రేజ్ పెరగడం.. దీంతో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ని కత్తిరించే ప్రయత్నంలో భాగంగానే వర్ల రామయ్య.. కొడాలి నాని, వల్లభనేని వంశీ, ఎన్టీఆర్ కి లింక్ పెడుతూ.. విమర్శలు చేశారు. జూనియర్ ఎన్టిఆర్ ఆశించిన స్థాయిలో స్పందించలేదని చెబుతున్న వర్ల రామయ్యకు లోకేష్ అసలు మాట్లాడని విషయం తెలిసినట్టు లేదని, నాని, వంశీ అన్నారు.

  జూనియర్ ఎన్టీఆర్ ని నందమూరి కుటుంబం ఇంకా దూరంగానే పెట్టేందుకు ప్రయత్నం చేస్తోందా..? ఇప్పుడీ అనుమానాలే బలపడుతున్నాయి. దీని వెనక చంద్రబాబు హస్తం, లోకేష్ రాజకీయం ఉందా..? అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. మొదట్నుంచి చంద్రబాబు.. జూనియర్ ఎన్టీఆర్ ని దూరంగా పెట్టారు. ఓ దశలో చంద్రబాబు ఎన్టీఆర్ ని ప్రచారం కోసం వాడుకున్నా తర్వాత పక్కనపెట్టారు.

  లోకేష్ ని రంగంలోకి తెచ్చేందుకు ఉద్దేశ పూర్వకంగానే జూనియర్ ని పక్కకు తప్పించారు. జూనియర్ ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ కూడా దీనిపై చాలాసార్లు ఆవేదన వ్యక్తం చేశారు. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూకట్ పల్లి నియోజకవర్గంలో జూనియర్ ఎన్టీఆర్ సోదరి సుహాసినిని బరిలో దింపినా చంద్రబాబు వల్లే అప్పట్లో ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ కూడా ప్రచారానికి వెళ్లలేదు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబుకి మద్దతుగా మాట్లాడినా ఇప్పుడు కూడా ఆయన్ను కావాలనే పక్కకు పెట్టే ప్రయత్నం మొదలైంది.

  వాస్తవంగా జూనియర్ ఎన్టీఆర్ స్పందనకే ఎక్కువ స్పందన వచ్చింది. అయితే కావాలనే ఆయన పేరుని వర్ల రామయ్య ప్రస్తావించేలా చేశారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మాత్రం దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ విషయంపై అసలు లోకేష్ మాట్లాడలేదు కదా, మరి ఆయన్ను ఎందుకు వదిలేసి, ఎన్టీఆర్ స్పందనపై మాత్రమే గొడవ చేస్తున్నారని అంటున్నారు. ఇప్పుడు కొడాలి నానికి, వంశీకి, జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధం ఉన్నట్టు చెబుతూ.. ఎన్టీఆర్ ని ఇబ్బంది పెట్టేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారంటూ ఎన్టీఆర్ అభిమానులు మండిపడుతున్నారు.

   

  ఇవీ చదవండి

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.