కాలేజీ అమ్మాయిలకోసం సరికొత్త ట్రెండీ నగలు..

    0
    102

    ఇంటర్నెట్ యుగంలో ప్యారిస్ లోనే కాదు, ఇండియాలో కూడా గంటకో ఫ్యాషన్ మారిపోతోంది. ముఖ్యంగా అమ్మాయిల విషయంలో కొత్త కొత్త ఫ్యాషన్లు రాజ్యమేలుతున్నాయి. అలాంటి వాటిలో ఈ చాంద్ బాలీ నగలు కూడా ఉన్నాయి. వరుసలుగా ఉండే ఈ నగలను చాంద్ బాలీ నగలంటారు. బంగారం కంటే.. ఇతర మెటల్స్ లోనే ఇవి ఎక్కువగా ఫేమస్. మొఘలులు, నిజాంల కాలం నాటి ఈ ఆభరణాలకు ఇప్పుడు మళ్లీ డిమాండ్ పెరిగింది.

     

    బాలీవుడ్ హీరోయిన్లే బ్రాండ్ అంబాసిడర్లు.
    బాలీవుడ్ హీరోయిన్లు చాంద్ బాలీ నగలతో రకరకాల ఫొటో షూట్లతో అలరిస్తున్నారు. ముఖ్యంగా ఈ తరం అమ్మాయిలు ఆలియా భరట్, జాన్వీ కపూర్ చాంద్ బాలీ తరహా నగలను బాగా పాపులర్ చేస్తున్నారు. చీర, గాగ్రా, చుడీదార్‌.. ఇలా ఏ దుస్తులైనా సరే, చాంద్‌బాలీ నగలను అలంకరించుకోడానికి అతివలు ఎక్కువ ఇష్ట పడుతున్నారు.

     

    చాంద్‌ బాలీ అంటే జుంకాలకే పరిమితమైన డిజైన్‌ అనేది ఒకప్పటి మాట. ఇప్పుడు హారాలు, నెక్లెస్‌లు, మాంగ్‌టిక్కా (పాపిట బిళ్ల)లూ తయారవుతున్నాయి. ఒకే డిజైన్లో తయారై, ఒకే రకమైన రాళ్లు, రత్నాలు పొదిగిన కాంబోలు కూడా అందుబాటులో ఉన్నాయి. సంప్రదాయ దుస్తులకు, నగలకు పెరుగుతున్న ఆదరణతో చాంద్‌బాలీలు మరోసారి ఫ్యాషన్‌ ప్రపంచంలో తళుక్కుమంటున్నాయి. బాలీవుడ్‌ నుంచి టాలీవుడ్‌దాకా రూపొందుతున్న ‘చారిత్రక’ సినిమాల వల్ల వీటికి మరింత క్రేజ్‌ పెరిగింది. ఐశ్వర్యారాయ్‌, దీపికా పదుకొనే, ప్రియాంకా చోప్రా, జాన్వీ కపూర్‌, అదితీరావు హైదరీ వంటి బాలీవుడ్‌ భామలు చాంద్‌బాలీ జుంకాలను అలంకరించుకోవడంతో వీటికి డిమాండ్ బాగా పెరిగింది.

    ఇవీ చదవండి

    పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

    ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

    పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

    తిరుమల నామాల పార్కులో కోడె నాగు..