5 నెలల గర్భం.. అసాధారణ ప్రసవం..

  0
  367

  తల్లి గర్భంలో పిండం పరిపూర్ణంగా ఎదిగక ముందే జన్మిస్తే.. అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. 8వ నెల, 7వ నెలలో పుట్టిన పిల్లలు బలహీనంగా ఉంటారు. అదృష్టం బాగున్నవాళ్లు.. తర్వాతి కాలంలో అందరిలాగే ఎదుగుతారు. లేకపోతే ఇబ్బంది పడతారు. 5, 6 నెలల్లో పుట్టిన పిల్లలు బతికి బట్టకట్టినట్టు చరిత్రలో లేదు. కానీ ప్రపంచంలోనే తొలిసారిగా 5 నెలల గర్భానికే ఓ శిశువు జన్మించింది. అమెరికాలో జన్మించిన ఈ చిన్నారి మృత్యువుని జయించాడు.

  అలబామాకు చెందిన మిచెల్ బట్లర్ గర్భవతి. కానీ ఆమెకు అత్యవసరంగా సర్జరీ చేయాల్సి వచ్చింది. కాబట్టి కడుపులో ఉన్న శిశువును త్యాగం చేయక తప్పని పరిస్థితి. కానీ మిచెల్ అంగీకరించలేదు. బిడ్డకు జన్మనివ్వడానికి పట్టుబట్టింది. అప్పటికి ఆమెకు 5 నెలలు గర్భం మాత్రమే. అలా 148 రోజుల గర్భానికే కర్టిస్ కు జన్మనిచ్చింది మిచెల్. అంటే.. 9 వారాల ముందుగానే కర్టిస్ జన్మించాడన్నమాట.

  ఇలా జన్మించిన శిశువులెవ్వరూ బతకలేదు. కర్టిస్ మాత్రం బతికాడు. పుట్టిన వెంటనే అతడి గుండె ప్రతిస్పందించింది. ఊపిరితిత్తులు ఆక్సిజన్ స్వీకరించడానికి సహకరించాయి. దీంతో వైద్యులు అతికష్టమ్మీద కర్టిస్ ను కాపాడుకుంటూ వచ్చారు. అలా 275 రోజులు ఐసీయూలో గడిపిన తర్వాత పూర్తిస్థాయిలో కోలుకున్నాడు కర్టిస్.

  పుట్టినప్పుడు కర్టిస్ బరువు కేవలం 420 గ్రాములు మాత్రమే. కానీ అతడు క్రమక్రమంగా తన బరువును, రోగనిరోధక శక్తిని పెంచుకున్నాడు. 3 నెలల వయసు వచ్చిన తర్వాత కర్టిస్ కు వెంటిలేటర్ ను తొలిగించారు. ప్రస్తుతం అతడు గాలి పీల్చుకుంటున్నప్పటికీ, చిన్నపాటి ఎక్స్ టర్నల్ సపోర్ట్ అందిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ లో కర్టిస్ ను డిశ్చార్డ్ చేశారు. ప్రస్తుతం అతడు ఆరోగ్యంగానే ఉన్నాడు.

  ఇవీ చదవండి

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు..