మళ్ళీ మరో మాయదారి వాయుగుండం.. మనకే గండం..?

  0
  27464

  ఈశాన్య రుతుపవనాల సీజన్ లో బంగాళాఖాతంలో తరచుగా అల్పపీడనాలు ఏర్పడుతుంటాయి. తాజాగా కొన్నిరోజుల వ్యవధిలోనే రెండు అల్పపీడనాలు ఏర్పడగా తమిళనాడు, ఏపీపై తీవ్ర ప్రభావం చూపించాయి. ఈ క్రమంలో ఈ నెల 13న మరో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ చెబుతోంది. అండమాన్ సముద్రంలో ఏర్పడే ఈ అల్పపీడనం బంగాళాఖాతంలో ప్రవేశించి ఏపీ వద్ద తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు..

  బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం చేరిన నేపథ్యంలో రాగల 24 గంటల్లో ఏపీ వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. కాగా, ఏపీ వాతావరణ పరిస్థితులపై రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ కమిషన్ కె.కన్నబాబు స్పందించారు. వాయుగుండం ప్రభావంతో నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని, అత్యవసర సహాయ చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను పంపించినట్టు వెల్లడించారు.

   

  ఇవీ చదవండి

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు..