కొవాక్సిన్ మార్కెట్లోకి రావాలంటే 4 నెలలు..

  0
  31

  కోవిడ్ 19 వైర‌స్ నియంత్ర‌ణ‌ కోసం ఫార్మా కంపెనీలు వ్యాక్సిన్లు త‌యారు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే వ్యాక్సిన్ త‌యారీ ఎంత క‌ష్ట‌మో… పంపిణీ చేయాల‌న్న కూడా అంతే క‌ష్టం. ఎన్నో ద‌శ‌లు దాటుకుని వ్యాక్సిన్లు మార్కెట్లోకి వ‌స్తాయి. ఈ విష‌యాన్ని కోవాగ్జిన్ వ్యాక్సిన్ తయారీ సంస్థ అయిన భార‌త్ బ‌యోటెక్ ప్రెస్ నోట్ ద్వారా వెల్ల‌డించింది.

  ఒక వ్యాక్సిన్ మార్కెట్లోకి రావాలంటే దాదాపు నాలుగు నెల‌ల స‌మ‌యం ప‌డుతుంది. వ్యాక్సిన్ త‌యారీలో వాడే సాంకేతిక‌… ప‌రీక్ష‌లు… రెగ్యులేట‌రీ అప్రూవ‌ల్స్… ఆ త‌ర్వాత మార్కెటింగ్… ఇలా ఉత్ప‌త్తి నుంచి పంపిణీ వ‌ర‌కు 120 రోజుల స‌మ‌యం ప‌డుతుంది. ఉదాహ‌ర‌ణ‌కి మార్చిలో వ్యాక్సిన్ త‌యారీ మొద‌లు పెడితే… మార్కెట్లోకి వ‌చ్చే వ‌ర‌కు ఎన్నో ద‌శ‌ల‌న్నీ దాటుకుని రావాల్సి వుంటుంది. ఇది క్లిష్ట‌త‌ర‌మైన ప్ర‌క్రియ‌. ఈ విష‌యాన్ని గ‌మ‌నించాల‌ని భార‌త్ బ‌యోటెక్ పేర్కొంది. అలాగ‌ని ఒకేసారి ఉత్ప‌త్తి సామ‌ర్ధ్యాన్ని పెంచాలంటే కూడా సాధ్యం కాదు.

  ఒక ప్ర‌ణాళికా బ‌ద్దంగా ముందుకు సాగాల్సి వుంటుంది. సెంట్ర‌ల్ డ్ర‌గ్ స్టాండెండ్ కంట్రోల్ ఆర్గ‌నైజేష‌న్ మార్గ‌ద‌ర్శ‌కాలు పాటించాల్సి ఉంటుంది. ఈ మార్గ‌ద‌ర్శ‌కాలు కూడా చాలా క‌ఠినంగా ఉంటాయి. వ్యాక్సిన్ త‌యారైన ప్ర‌తి బ్యాచ్ ని కేంద్ర‌ప్ర‌భుత్వ ఆధీనంలోని సెంట్ర‌ల్ డ్ర‌గ్ ల్యాబొరేట‌రీకి ప‌రీక్ష‌ల‌కు పంపించాల్సి వుంటుంది.

  అక్కడి నుంచి గ్రీన్ సిగ్న‌ల్ వ‌చ్చిన త‌ర్వాత కేంద్ర ప్ర‌భుత్వ ఆదేశాల మేర‌కు వివిధ రాష్ట్రాల‌కు, ఏజున్సీల‌కు వ్యాక్సిన్లు పంపిణీ చేయాల్సి వుంటుంది. త‌యారైన రెండు రోజుల త‌ర్వాత అన్ని ప్రాంతాల‌కు ఇవి స‌ర‌ఫ‌రా అవుతాయి. అయితే స‌ర‌ఫ‌రా బాధ్య‌త మాత్రం ప్ర‌భుత్వానిదే. ఆ విష‌యంలో మాత్రం మాకు సంబంధం లేదు అంటూ… భార‌త్ బ‌యోటెక్ స‌వివ‌రంగా ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది.

  ఇవీ చదవండి..

  ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

  కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

  ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

  ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..