ఆరేళ్ళ బాలుడికి మోటార్ బైక్ ఇచ్చాడని బాలుడి తండ్రిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బురదలో బైక్ రేసింగ్ పోటీలకు కేరళలోని పాలఘాట్, కాదంగొడ్ చాలా ఫేమస్ . వీటికోసం పెద్దవాళ్ళు బైక్ రేసింగ్ ప్రాక్టీస్ చేస్తుంటే , షాన్వాజ్ అబ్దుల్లా అనే వ్యక్తి , తన ఆరేళ్ళ కొడుకు కోసం చిన్న బైక్ కొని , రేసులో పాల్గొనేందుకు శిక్షణ ఇస్తున్నాడు.
రేసింగ్ కి ముందు జరిగే ట్రయల్స్ లో కూడా , ఆ బాలుడు పాల్గొన్నాడు. ఈ విషయం పోలీసుల దృష్టికి రావడంతో , తండ్రిపై , కేసుపెట్టి , బాలుడి బైక్ ని స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 16, 17 తేదీలలో బురద , మట్టి రోడ్లలో ఈ బైక్ రేసులు జరుగుతాయి. ప్రమాదకరమైన ఈ రేసులలో పాల్గొనే పెద్ద వాళ్ళతో ఆరేళ్ల బాలుడిని మోటార్ సైకిల్ తో , పాల్గొనేందుకు అనుమతించిన , బైకర్ క్లబ్ పైకూడా కేసు నమోదు చేశారు..