క్యారీ బ్యాగ్ లకు డబ్బులు అడిగినందుకు డి మార్ట్ కి 50 వేలు ఫైన్..

  0
  568

  మీరు సూపర్ మార్కెట్ కో, షాపింగ్ మాల్ కో పోతున్నారుకదా..? సరుకులు తీసుకున్నతరువాత , క్యారీ బ్యాగ్ కావాలా ..? అని అడుగుతారు.. కావాలంటే డబ్బులు వసూలు చేస్తారు.. అయితే మీకు విషయం తెలుసా..? సరుకులు కొన్నప్పుడు క్యారీ బ్యాగ్ ఇవ్వాల్సిన బాధ్యత కూడా షాప్ యజమాన్యందే.. ఇలాంటి మోసం చేసినందుకే హైదరాబాద్ లో పారడైజ్ రెస్టారెంట్ , డి మార్ట్ సంస్థలకు 50 వేళా రూపాయల చొప్పున ఫైన్ వేశారు.. దీనికితోడు కస్టమర్ కు నష్టపరిహారం కూడా చెల్లించాలని వినియోగదారుల ఫోరమ్ ఆదేశించింది. ఒక్క క్యారీ బ్యాగ్ కి మూడున్నర నుంచి నాలుగు రూపాయలు వసూలు చేస్తున్నారు. క్యారీ బ్యాగ్ కు విడిగా డబ్బులు వసూలుచేయదం వినియోదారుల చట్టానికి వ్యతిరేకం.. ఈ రెండు సంస్థలు క్యారీ బ్యాగ్ డబ్బులు వసూలు చేస్తూ , అవికూడా ప్లాస్టిక్ బాగ్స్ ఇస్తున్నాయని , ఇలా కూడా నిబంధనలు ఉల్లంఘించాయని కోర్టు వ్యాఖ్యానించింది., క్యారీ బ్యాగ్ లను ఇవ్వాల్సిన బాధ్యతనుంచి రెస్టారెంట్లు , కంపెనీలు తప్పించుకోలేవని చెప్పింది.

  ఇవీ చదవండి..

  రేపిస్టులను పట్టడంలో ఆ కుక్క దిట్ట..

  ఇద్దరమ్మాయిల సహజీవనానికి అనుమతిఇస్తూ..

  తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..

  పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్