బుల్ డోజర్ .. బాబా, ఇదో కొత్తరకం శిక్ష..

  0
  392

  బుల్ డోజర్ .. బాబా, ఇదీ ఇప్పుడు ఉత్తరప్రదేశ్ తరువాత , మధ్యప్రదేశ్ లో మోగిపోతున్న టాక్.. ఇదో కొత్తరకం శిక్ష.. ఉత్తరప్రదేశ్ లో రేపిస్టులు , మాఫియాలను అరెస్ట్ చేయడమో , ఎన్ కౌంటర్లో కాల్చి చంపడమో చేసే యోగి ప్రభుత్వం స్టైల్లోనే ఇప్పుడు మధ్యప్రదేశ్ లో చౌహన్ సర్కార్ చేస్తోంది.. మూడు రోజుల్లో ఇద్దరు రేపిస్టుల ఇళ్లను , మేరేజ్ హాల్స్ ని బుల్ డోజర్లతో కూల్చేశారు.

  మధ్యప్రదేశ్ లో అశోక్ నగర్ జిల్లాలో మంగోలిలో , ఒక మైనర్ బాలికపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేసారు. ఒక మేరేజ్ హాల్ , శుభ్రం చేస్తున్న మైనర్ బాలికను , మేరేజ్ హాల్ ఓనర్ కొడుకు , డానిష్ ఖాన్ , కౌన్సిలర్ కొడుకు నిసార్ ఖాన్ , గది శుభ్రం చేయమని పిలుస్తున్నారని చెప్పారు. ఆ బాలిక గదిలోకి పోయినతరువాత , బందించి అత్యాచారం చేశారు. ఈ విషయం ఆమె తల్లికి చెప్పింది. పోలీసు ఫిర్యాదుతో , విచారణ జరిపిన పోలీసులు ఇద్దరినీ అరెస్ట్ చేసి , బేడీలు వేసి రోడ్లో పెరేడ్ చేయించి జైలుకు పంపారు. తరువాత వాళ్ళిద్దరి ఇళ్లను , అత్యాచారం జరిగిన మేరేజ్ హాల్ ని , కూల్చేశారు..

  మరో ఘటనలో షాదోల్ జిల్లా ముధోల్ లో 28 ఏళ్ళ యువతిని , ముగ్గురు స్నేహితులు షాదాబ్ ఉస్మాని , రాజేష్ , సోను జార్జ్ అనే వాళ్ళు సామూహిక అత్యాచారం చేసి చంపేశారు. దీంతో వారిని అరెస్ట్ చేసిన పోలీసులు షాదాబ్ ఉస్మాని ఇంటిని కూల్చేశారు. మిగిలిన ఇద్దరి నిందితుల ఇళ్ళు అద్దెవి కావడంతో వాటిని వదిలేశారు..

   

  ఇవీ చదవండి… 

  అందమైన ఒంటె రెండు కోట్లు గెలిచింది..

  నాగచైతన్యను మరోసారి బాధపెట్టిన సమంత..!

  చీకేసిన మామిడిముట్టి లాంటి తలకి మళ్లీ హెయిర్ స్టైలిస్టు కావాలా..?

  సోనూ సూద్, గౌతమ్ రెడ్డి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటన్నారో.