చెన్నైలో మరో ఈవి స్కూటర్ తగలబడింది..ఇదేందబ్బా ..?

  0
  559

  ఈ బైక్ వాడుతున్నారా..?

  అయితే కాస్త జాగ్రత్తగా ఉండండి..

  ఎలక్ట్రికల్ స్కూటర్ లపై ఇప్పుడు అనుమానాలు నెలకొన్నాయి. నాలుగురోజుల్లో నాలుగు స్కూటర్లు మంటల్లో మాడిమసై పోయాయి. రాయవేలూరు, పూణే,చెన్నై ఇలా వరుసగా ఎలక్ట్రికల్ స్కూటర్లు కాలిపోతుండడంతో భయాందోళనలు నెలకొన్నాయి. తాజాగా చెన్నైలో మరొక ఎలక్ట్రిక్ స్కూటర్ తగలబడిపోయింది. ఎకనామిక్ టైమ్స్ పత్రికకు చెందిన ఉద్యోగి ఈ స్కూటర్ కొనుగోలు చేశాడు.

  స్కూటర్ ఏమో కొత్తదే.. చెన్నైలోని మంజంబాకం టోల్ ప్లాజా వద్ద ఆగి ఉండగా సడన్ గా తగలబడిపోయింది. ఇటీవల తమిళనాడులోని రాయవేలూరులో కొత్త స్కూటర్ కొని.. ఛార్జింగ్ పెడుతుండగా తండ్రీకూతుళ్ళు ఇద్దరూ చనిపోయారు. పూణేలో ఓలా S1 స్కూటర్ పార్కింగ్ లో ఉండగానే కాలిపోయింది. పార్కింగ్ చేసిన 31 సెకండ్లలోనే ఈ స్కూటర్ కాలిపోయింది.

  ఇలా దేశంలో అనేక సంఘటనలు జరుగుతున్నాయి. దీంతో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ల నాణ్యత, తయారీపై కూడా అనుమానాలు నెలకొన్నాయి. స్కూటర్లలో లిథియం అయాన్ బ్యాటరీ, థర్మల్ సిస్టం సరిగ్గా లేకపోవడమే కారణమని నిపుణులు చెబుతున్నారు. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సరిగ్గా లేకపోవడం కూడా కారణమేనని అంటున్నారు.

  మరొకవైపు మార్కెట్ లో ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ కంపెనీల మధ్య పోటీ నెలకొనడంతో.. నాణ్యత ప్రమాణాలు పాటించకుండానే స్కూటర్లను మార్కెట్ లోకి తెచ్చేస్తున్నారని కూడా అంటున్నారు. ఏదిఏమైనా ఎలక్ట్రిక్ స్కూటర్లు వాడేవారు కాస్తంత జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. కంపెనీ సూచించిన ప్రకారం స్కూటర్ ను వాడాలని.. కంపెనీ సూచించిన విధంగానే ఛార్జింగ్ చేయాలని కూడా చెబుతున్నారు. దేశంలో ఇటీవల పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగిపోతుండటంతో, జనం కూడా ఈ ఎలక్ట్రికల్ స్కూటర్ల వైపు మొగ్గుచూపుతున్నారు.

   

  ఇవీ చదవండి… 

  అందమైన ఒంటె రెండు కోట్లు గెలిచింది..

  నాగచైతన్యను మరోసారి బాధపెట్టిన సమంత..!

  చీకేసిన మామిడిముట్టి లాంటి తలకి మళ్లీ హెయిర్ స్టైలిస్టు కావాలా..?

  సోనూ సూద్, గౌతమ్ రెడ్డి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటన్నారో.