ఎద్దుకు కోపం వ‌స్తే ఎలా ఉంటుందో తెలుసా ?

  0
  218

  ఎద్దుకు కోపం వ‌స్తే ఎలా ఉంటుందో తెలుసా ? రంకెలేస్తూ దూకితే ఎంత భ‌యంక‌రంగా ఉంటుందో తెలుసా ? దాన్ని ఆప‌డం ఎవ‌రిత‌రం కాదు. ఓ ఎద్దుకు ఇలాగే కోపం వ‌చ్చిందో ఏమో.. విధి నిర్వ‌హ‌ణ‌లో ఉన్న పోలీసుపైకి దూకింది. వాడి కొమ్ముల‌తో పైకి లేపి విసిరేసింది. ఆ దెబ్బ‌కి కానిస్టేబుల్లో గాల్లో బంతిలా పైకెగిరి కింద ప‌డిపోయాడు. ఢిల్లీలో ఘ‌ట‌న చోటుచేసుకుంది.

  దయాల్‌పుర్‌ ప్రాంతం శేర్‌పుర్‌ కూడలిలో కానిస్టేబుల్‌ జ్ఞాన్‌సింగ్‌ విధులు నిర్వహిస్తున్నాడు. ఆ ప‌క్క‌నే టూవీల‌ర్ పార్కింగ్ వ‌ద్ద ఓ ఎద్దు త‌చ్చాడుతూ ఉంది. ఉన్న‌ట్టుండి ఒక్క‌సారిగా ఆ ఎద్దు కానిస్టేబుల్ పైకి దూకింది. వెనుక నుంచి వచ్చి కానిస్టేబుల్‌ను కొమ్ములతో గాల్లోకి లేపి కింద పడేసింది. కింద ప‌డ‌డంతో ఆయ‌న త‌ల‌కు గాయాల‌య్యాయి. ప‌క్క‌నే ఉన్న మరో కానిస్టేబుల్‌, స్థానికులు జ్ఞాన్‌సింగ్‌ను వెంట‌నే చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఆ ప్రాంతంలో ఉన్న సీసీ ఫుటేజీలో ఈ దృశ్యం రికార్డ్ అయ్యింది.

  ఇవీ చదవండి… 

  అందమైన ఒంటె రెండు కోట్లు గెలిచింది..

  నాగచైతన్యను మరోసారి బాధపెట్టిన సమంత..!

  చీకేసిన మామిడిముట్టి లాంటి తలకి మళ్లీ హెయిర్ స్టైలిస్టు కావాలా..?

  సోనూ సూద్, గౌతమ్ రెడ్డి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటన్నారో.