తన పొట్టి డ్రెసుల కామెంట్లపై రంగమ్మత్త సీరియస్..

  0
  1913

  అనసూయకి మళ్ళీ కోపమొచ్చింది..ఈ సారి నేరుగా ఏమందంటే..?
  అనసూయకి మళ్ళీ కోపమొచ్చింది. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా కనిపించే అనసూయ మళ్ళీ ఇంకొక నెటిజన్ పై ఫైర్ అయింది. తరచూ పొట్టిబట్టలు వేసుకొని మీడియాలో కనిపించడంపై ఓ నెటిజన్ ఆమెకు సలహా ఇచ్చాడు. ఇద్దరు పిల్లల తల్లివై ఉండికూడా ఇలాంటి పొట్టి బట్టలు ఎందుకు ధరిస్తారని సోషల్ మీడియా వేదికగా అనసూయని ప్రశ్నించారు.

  దీనిపై అనసూయ తన వివరణ ఇచ్చారు. దయచేసి మీరు మీ పనిని చూసుకోండి.. నన్ను నా పనిని చేసుకోనివ్వండి.. మీరు ఇలా ఆలోచించి మగజాతి పరువు తీస్తున్నారు.. అంటూ అనసూయ ఘాటుగానే స్పందించింది. అయితే అనసూయ కామెంట్లపై కొందరు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. ఇలాంటి కామెంట్లకు ఎందుకు స్పందిస్తారు మేడం అంటూ ఆమెకు అండగా మాట్లాడుతున్నారు. మరికొందరు మాత్రం మీరు ఇంకా ఇలాంటి డ్రెస్సులు వేసుకొని ఫోటో షూట్లు చేయండి.. మేము కూడా చూసేందుకు సిద్ధంగా ఉన్నామంటూ కామెంట్లు రాస్తున్నారు.

  మరికొందరైతే అనసూయ భర్తకు లేని బాధ నీకెందుకయ్యా అంటూ నెటిజన్ ను విమర్శిస్తున్నారు. మొత్తానికి అనసూయ ఎపిసోడ్ సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అవుతోంది. గతంలోనూ ట్రోలర్స్ కు అనసూయ ఇలానే బుద్ధి చెప్పింది. అయినప్పటికీ ఆమెపై ఇలాంటి కామెంట్లు వస్తూనే ఉండటం విశేషం.

  ఇవీ చదవండి… 

  అందమైన ఒంటె రెండు కోట్లు గెలిచింది..

  నాగచైతన్యను మరోసారి బాధపెట్టిన సమంత..!

  చీకేసిన మామిడిముట్టి లాంటి తలకి మళ్లీ హెయిర్ స్టైలిస్టు కావాలా..?

  సోనూ సూద్, గౌతమ్ రెడ్డి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటన్నారో.