పెళ్లికొడుక్కి ముసుగేసి పెళ్లికూతురు పరార్ – చెల్లెలితో పెళ్లి , మళ్ళీ మరో ట్విస్ట్..

  0
  1443

  మరో పెళ్లి కూతురు పరార్ .. పాపం పెళ్ళికొడుకు ..ఊరేగింపుగా పెళ్లిమండపానికి వచ్చాడు.. పెళ్లిపీటలపై కూర్చున్నాడు.. ఎంతకీ పెళ్లికూతురు రాలేదు. గదిలోకి పోయిచూస్తే పెళ్లికూతురు లేదు.. మండపంలోకి రాకముందే వెనుకవైపు తలుపు తీసుకొని ప్రియుడితో పరార్ అయింది. ఒరిస్సాలోని మల్పడాలో జరిగిందీ ఘటన.

  పెళ్లికూతురు మోసం చేసి ప్రియుడితో పారిపోవడంతో పెళ్ళికొడుకు గొడవచేశాడు. పెళ్లిచేసుకోకుండా ఊరికిపోతే తమ పరువు పోతుందని ఆగ్రహం వ్యక్తంచేశాడు. తనకు జరిగిన అవమానానికి పెళ్లికూతురు తల్లి తండ్రులే బాధ్యత వహించాలని అన్నాడు. పెళ్ళికొడుకు బంధువులు గొడవకు దిగారు. కనీసం పెళ్లికూతురు చెల్లెలు ని ఇచ్చి పెళ్ళిచెయ్యాలని కోరారు. దీంతో అబ్బాయికి , పెళ్లికూతురు చెల్లెలిని ఇచ్చి వివాహం చేశారు.

  మళ్ళీ పెళ్ళికొడుకుని దురదృష్టం వెంటాడింది. శోభనం టైంకి , పోలీసులు , వచ్చేసారు. 15 ఏళ్ళుకూడా లేని అమ్మాయితో పెళ్లి చట్టవిరుద్ధమని చెప్పి , 18 ఏళ్ళవరకు వెయిట్ చెయ్యమని సలహా ఇచ్చి , అమ్మాయిని పంపేశారు..

  ఇవీ చదవండి:

  అక్కినేని వారి ఇంటి కోడలు సమంత ఇలా చేసిందా..?

  ఆ కొడుకు 11 ఏళ్లకే తండ్రిని 10 కోట్లు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేశాడు..

  ఆ దేవుడికి పళ్ళు , ఫలహారాలు కాకుండా , మద్యమే నైవేద్యంగా ఎందుకు పెడతారో తెలుసా..?