ప్రియుణ్ణి టెన్షన్ పెట్టాలని పెళ్లి పీటలెక్కిందంట ..

  0
  1317

  పెళ్లి పీటల వరకు వచ్చే కొంతమంది ఆడపిల్లలు ఇటీవల కాలంలో మరీ ఓవరాక్షన్ చేసేస్తున్నారు .. తాళి కట్టే ముందు పెళ్లి వద్దని వెళ్లిపోవడం , ఆ సమయంలో పెళ్ళికొడుకు బాగా లేడని అలిగి పెళ్లి మండపం నుంచి వెళ్లిపోవడం , లేదంటే కంటి చూపు సరిగా లేదని చెప్పడం , అదీ కాదంటే తాళి కట్టే సమయంలో పెళ్లికొడుకును , కాసేపు ఉండి నా ప్రియుడు వస్తాడు, వాడు వచ్చిన తర్వాత ఆలోచిద్దాం అని చెప్పడం , లేదంటే పెళ్లికి ముందు ప్రియుడితో లేచిపోవడం ఇలాంటి సంఘటనలు నిత్యం చూస్తూనే ఉన్నాం .

  ఇప్పుడు మరోసారి ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ లో పెళ్లిలో వర మాల కార్యక్రమంలో పెళ్ళికొడుకు పెళ్ళికూతురు మెడలో మాల వేసాడు. ఆ తర్వాత పెళ్లి కూతురికి ఇచ్చి పెళ్లి కొడుకు మెడలో వేయనున్నారు దీంతో పెళ్లికూతురు మాల వేయకుండా పెళ్ళికొడుకుని చెంపమీద ఒక దెబ్బ కొట్టేసింది . ఇదేదో పెళ్లి కూతురు చమత్కారం చేస్తుందని అనుకున్నారు కానీ పెళ్లి కొడుకుని చెంపమీద కొట్టిన తర్వాత , పెళ్లికూతురు వేదిక దిగి వెళ్ళిపోయింది .

  ఈ విషయం పోలీసుల వరకు చేరింది . పోలీసులు ఇలా ఎందుకు చేసావని అడిగితే తనకు పెళ్లి కూడా ఇష్టం లేదని తాను వేరే వారిని ప్రేమిస్తున్నానని చెప్పింది. ఇష్టం లేని పెళ్లి చేసుకోలేనని అని చెప్పింది. అయితే ఇంత వరకూ పరిస్థితి ఎందుకు తీసుకొచ్చావు అని అడిగితే తన లవర్ కి సస్పెన్స్ లో పెట్టి , టెన్షన్ పెట్టేందుకని ముచ్చటగా చెప్పేసింది . అమ్మాయి , మేనమామ మాత్రం , ఆమె చేతికి కంకణం లేకపోవడంల్ల , క్షుద్రశక్తి అలా చేయించిందని చెబుతున్నాడు..

  ఇవీ చదవండి… 

  బుల్లెట్ బండెక్కి వచ్చింది పాప .. సూపర్..

  మెగా ఫ్యామిలీకి ఏమిటీ శాపం..నాగబాబుకు ఇక నోరెత్తలేని పరిస్థితి.

  ఎమ్మెల్యే మేకపాటి రెండో భార్య శాంతమ్మ మాటలు వెనుక అసలు కథేమిటో చూడండి.. ??

  ఆత్మకూరు నర్సు , ఒక ప్రియుడితో మరో ప్రియుడిని కారుతో ఢీకొట్టించి ఎలా చిక్కిందో చూడండి.