పీటలపైనుంచి, పెళ్లికూతురు ప్రియుడితో పరార్.

  0
  63616

  కొద్దీ నిమిషాల్లో పెళ్లి.. పెళ్లికూతురు , ప్రదానం అయిపోయినతరువాత , పెళ్లి చీర కట్టుకునేందుకు లోపలికి వెళ్ళింది.. అంతే , జానపద సినిమాల్లో మాదిరిగా మాయం అయిపొయింది.. బయటేమో , పెళ్లి కొడుకు పీటలపై కూర్చునిఉన్నాడు.. పురోహితుడు మంత్రాలు చదువుతున్నాడు.. పెళ్లికూతురిని , తీసుకురండి.. ముహూర్తం టైం అయిపోతుంది .. అంటూ తొందరపెట్టాడు.. లోపలికి పోయి చూస్తే , పెళ్లికూతురు లేదు..

  సీన్ కట్ చేస్తే.. మహాతల్లి , గోడదూకి ప్రియుడితో పరార్.. వెంటనే ప్రియుడితో తాళికట్టించేసుకుంది.. చిత్తూరు జిల్లా మదనపల్లిలో జరిగిందీ ఘటన. మదనపల్లె మండలం తట్టివారిపల్లెకు చెందిన సోనికకు , మదనపల్లి సొసై టీ కాలనీలో ఉంటున్న ఓ యువకుడితో వివాహం జరగాల్సివుంది. శని, ఆదివారాల్లో పెళ్లి జరిగేలా పెద్దలు నెల రోజుల క్రితం పత్రిక రాయించుకున్నా రు.

  శనివారం రాత్రి రిసెప్షన్‌ జరిగింది. ఆదివారం పెళ్లి మహూర్తానికి పెళ్లికూతురు, పెళ్లికొడుకుతోపాటు బంధువులు, మిత్రులు కల్యాణ మండపానికి చేరుకున్నారు. 5.30 గంటలకు ముహూర్తం కాగా ఆ సమయానికి పెళ్లి చీర కట్టుకునేందుకు సోనిక గదిలోకి వెళ్లి తిరిగి రాకుండా పోయింది.

  గదిలోకి పోయి పెళ్లి చీర మార్చుకొని , బయటే ఉన్న తన ప్రియుడు చరణ్ తో కలిసి , పుంగనూరుకు వెళ్లి, అక్కడే ఓ గుడిలో వివాహం చేసుకుంది. ఆ వెంటనే తమకు పెద్దలతో ప్రాణాపాయం ఉందంటూ పోలీసులను ఆశ్రయించింది…

  ఇవీ చదవండి

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.