రిసెప్షన్ కి రాకుండా పెళ్లికూతురు పరార్..

  0
  327

  మరో పెళ్లికూతురు పరార్.. తెల్లారితే పెళ్ళి.. ముందు రోజు రాత్రి రిసెప్షన్. పెళ్లికూతురు మేకప్ కోసం బ్యూటీ పార్లర్ కు వెళ్ళింది. ఇక్కడేమో పెళ్ళికొడుకు రెడీగా ఉన్నాడు. ఎంతకీ పెళ్లికూతురు రాలేదు. ఆమె తల్లితండ్రులూ రాలేదు. అసలు విషయం మెల్లగా తెలిసింది. పెళ్లికూతురు బ్యూటీ పార్లర్కు పోలేదని .ప్రేమించిన వాడితో లేచిపోయిందని. దీంతో అమ్మాయి తల్లితండ్రులు ఆమెకోసం అన్వేషణలో పడ్డారు.బ్యూటీ పార్లర్‌కు వెళ్లిన వధువు అదృశ్యం కావడంతో వరుడి బంధువులు వివాహం తాలూకు ఫ్లెక్సీలు చించివేసి ఆగ్రహం వ్యక్తం చేశారు.

  చెన్నై నగరం పూందమల్లికి చెందిన యువకుడికి యువతితో పెళ్లి కుదిరింది.ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. తెల్లారితే ముహూర్తం. బుధవారం సాయంత్రం రిసెప్షన్‌ కోసం గురువారం ఉదయం నసరత్‌పేటలోని ఓ కల్యాణమండపంలో వివాహానికి ఏర్పాట్లు ఘనంగా చేశారు. వరుడు వచ్చినా వధువు రాకపోవడంతో అనుమానమొచ్చింది. విచారిస్తే పెళ్లికూతురు లేచిపోయిందని చెప్పారు. వరుడు పోలీసులకు ఫిర్యాదుచేశాడు . తమకు ఖర్చులు ఇప్పించాలని , పరువుకు భంగం కలిగినందుకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు..

  ఇవీ చదవండి:

  అక్కినేని వారి ఇంటి కోడలు సమంత ఇలా చేసిందా..?

  ఆ కొడుకు 11 ఏళ్లకే తండ్రిని 10 కోట్లు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేశాడు..

  ఆ దేవుడికి పళ్ళు , ఫలహారాలు కాకుండా , మద్యమే నైవేద్యంగా ఎందుకు పెడతారో తెలుసా..?