7ఏళ్ల వారంటీతో 499తో బుకింగ్, ఎలక్ట్రిక్ బైక్

  0
  263

  ఎలక్ట్రిక్ బైక్ ల విభాగంలో సత్తా చూపించేందుకు అన్ని కంపెనీలు ప్రయత్నాలు మొదలు పెట్టాయి. ఇంధన ధరలు భారీగా పెరిగిపోతుండటంతో రాబోయే రోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాల గిరాకీ పెరిగే అవకాశముంది. ఈ నేపథ్యంలో.. బూమ్‌ మోటర్స్‌ తాజాగా విద్యుత్తుతో నడిచే వాహన సెగ్మెంట్‌ లోకి ప్రవేశించింది. ‘బూమ్‌ కార్బెట్‌’ పేరుతో విడుదల చేసిన తొలి బైకు ధర రూ.89,999గా నిర్ణయించింది. ఈ బైకుపై ఏడేండ్ల వారెంటీ ఇస్తున్నారు. బ్యాటరీకి ఐదేండ్ల గ్యారెంటీ ఇస్తున్నారు. పోర్టబుల్‌ చార్జర్‌ కలిగిన ఈ బైకు ప్రతి ఇంట్లో రీచార్జి చేసుకునే వీలుంటుంది. రెండు బ్యాటరీల ఆప్షన్‌ కలిగిన ఈ బైకు గంటకు 75 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది. ఈ నెల 12 నుంచి అంటే ఈరోజు నుంచే రూ.499 చెల్లించి ముందస్తు బుకింగ్‌ చేసుకోవచ్చు. ఇలా బుకింగ్‌ చేసుకున్నవారికి రూ.3 వేల వరకు ప్రత్యేక రాయితీ ఇస్తారు.

  ఇవీ చదవండి

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు..