72 ఏళ్ళ బాహుబలి.. మనరత్నం.

  0
  163

  ఉక్కు సంక‌ల్పం ఉంటే వ‌య‌సుతో ప‌ని ఏముంది. సంక‌ల్పం ముందు వ‌య‌సు చిన్న‌పోదా. ఈ ముస‌లాయ‌న‌ను చూస్తే అది నిజ‌మే అనిపిస్తుంది. వ‌య‌సు 72 ఏళ్ళు. పేరు ర‌త్నం. త‌మిళ‌నాడు రాష్ట్రం చెంగల్‌ప‌ట్టు జిల్లా మ‌ధుర‌కంట‌కం ప్రాంతానికి చెందిన వ్య‌క్తి.. ఈ వ‌య‌సులో ఎవ‌రైనా హాయిగా మ‌న‌వ‌ళ్ళు, మ‌న‌వ‌రాళ్ళ‌తో కాల‌క్షేపం చేస్తుంటారు. కానీ ఈయ‌న మాత్రం వ్యాయాయంతో దోస్తీ చేస్తున్నాడు. ఎందుకో తెలుసా ? అంత‌ర్జాతీయ బాడీ బిల్డింగ్ పోటీల్లో పాల్గొన‌డానికి. విన‌డానికి వింత‌గా ఉన్నా.. చూస్తే మాత్రం ఔరా అనాల్సిందే. ముదుస‌లి వ‌య‌సులో శ‌రీరాన్ని స్టీల్ బాడీలా మార్చేడాడు ర‌త్నం.

  రోజూ వ్యాయామం చేస్తే ర‌త్నం.. 72 ఏళ్ళ వ‌య‌సులోనూ శ‌రీర దారుఢ్యాన్ని, సౌష్ట‌వాన్ని ఏమాత్రం త‌గ్గించ‌లేదు. య‌వ్వ‌నంలో ఉన్న యువ‌కుడిలా వ్యాయామాలు చేస్తూనే ఉంటాడు. స్వ‌యంగా జిమ్ నిర్వ‌హిస్తోన్న ఆయ‌న‌… బాడీ బిల్డింగ్ కోసం జిమ్ కి వ‌చ్చే కుర్ర‌కారుకి కూడా మెళ‌కువ‌లు నేర్పుతుంటారు. ఇక ఆయ‌న సీనియ‌ర్ సిటిజ‌న్ విభాగంలో ఆసియా బాడీ బిల్డింగ్ పోటీల‌కు స‌న్న‌ద్ద‌మ‌వుతున్నాడు. 60 ఏళ్ళ పైబ‌డిన వారు ఈ పోటీల్లో పాల్గొన‌వ‌చ్చు. 72 ఏళ్ళ ర‌త్నం, భార‌త్ త‌ర‌ఫున ఈ ఏడాది బ‌రిలోకి దిగుతున్నాడు.

  త‌మిళ‌నాడు డీజీపీ శైలేంద్ర‌బాబు త‌న‌కు ఎప్ప‌టికీ ఆద‌ర్శ‌మ‌ని చెబుతుంటాడు ర‌త్నం. ఫిజిక‌ల్ ఫిట్ నెస్‌లో ఆయ‌న సోష‌ల్ మీడియాలో పెట్టే పోస్టులు త‌న‌ను ఎంతో ప్ర‌భావితం చేశాయ‌ని చెప్పుకొచ్చారు. ఆయ‌న స‌ల‌హాలు, సూచ‌న‌లు త‌న బాడీ బిల్డింగ్ కాంపిటీష‌న్ కు ఎంతో దోహ‌ద‌ప‌డ‌తాయ‌ని తెలిపారు. ఆసియా పోటీల్లో గెలుస్తాన‌నే ధీమా వ్య‌క్తం చేశాడు ర‌త్నం.

   

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి..