అసెంబ్లీ బాయికాట్ పై టిడిపి రివర్స్ గేర్ ..అసలు కారణం ఇదీ..

    0
    288

    అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని టిడిపి ఎందుకు నిర్ణయం తీసుకుంది..? చంద్రబాబు నాయుడు ఈ విషయంలో రివర్స్ గేర్ వేసేంత పరిస్థితి ఏమిటి..? గత సమావేశాలను బహిష్కరించిన తరువాత , మళ్ళీ చంద్రబాబు ముఖ్యమంత్రిగానే , సభకు వస్తామని చెప్పి వెళ్లిపోయారు. చంద్రబాబు భార్యను , కుటుంబాన్ని అవమానించిన తీరుకు నిరసనగానే అసెంబ్లీని బాయికాట్ చేస్తున్నట్టు చెప్పారు.

    చంద్రబాబు కార్చిన కన్నీటికి ప్రతీకారం తీర్చుకుంటామని అన్నారు. దీనిని ప్రజల్లో బలంగా తీసుకుపోయేందుకు , గౌరవ సభలపేరుతో ప్రతి ఊరిలో సమావేశాలుపెట్టి , చెప్పారు. అయితే ఇప్పుడు సడెన్ గా , రివర్స్ గేర్ వేశారు. చంద్రబాబు తప్ప మిగిలిన ఎమ్మెల్యేలంతా అసెంబ్లీకి పోతారని ప్రకటించారు. అసెంబ్లీని టిడిపి ఎమ్మెల్యేలు బహిష్కరించేనాటికి , ఇప్పటికి పెద్దగా తేడాలేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అద్వాన్నంగా ఉందని , దానిని గురించి చర్చించేందుకే తాము అసెంబ్లీకి పోవాలని నిర్ణయించుకున్నామని చెప్పారు.

    రాష్ట్ర ఆర్థిక పరిస్థితి , అద్వాన్నంగా ఉన్న మాట కొత్తేమి కాదు.. ఇది టిడిపి చెప్పే సహేతుకమైన కారణం కూడా కాదు.. ఎందుకంటే , చంద్రబాబు కుటుంబానికి జరిగిన అవమానానికి నిరసనగానే వాళ్ళు అసెంబ్లీని బహిష్కరించారు. మళ్ళీ చంద్రబాబు సీఎం అయితేనే తిరిగి అసెంబ్లీకి వస్తామని చెప్పారు. ఇప్పుడు టిడిపి ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావాలంటే , వైసిపి నేతలు , చంద్రబాబుకి క్షమాపణ అయినా చెప్పాలి.. అప్పుడే టిడిపి తమ నిర్ణయాన్ని సమర్ధించుకోవాలి.. కానీ అదేమీ జరగకుండానే , టిడిపి ఎమ్మెల్యేలు , అసెంబ్లీకి హాజరు కావాలని నిర్ణయం వెనుక అసలు కారణం , అమరావతి రాజధాని అంశం..

    హైకోర్టులో అమరావతికి అనుకూలంగా స్పష్టమైన తీర్పు రావడంతో , టిడిపిలో నైతిక బలం పెరిగింది. కోర్టు తీర్పుని అడ్డంపెట్టుకొని , అమరావతిపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని , ప్రభుత్వ వాదనేమిటో చెప్పాలంటూ నిలదీయడమే టిడిపి వ్యూహం.. అదే టిడిపి రివర్స్ గేరుకు కారణం….

     

    ఇవీ చదవండి… 

    బాబూ , బాబూ అంటూ ముద్దాడుతూ రోదిస్తున్న గౌతంరెడ్డి తల్లి

    మిస్ యూ గౌతమ్.. ఎమోషనల్ అవుతున్న బాల్య మిత్రులు..

    నా భార్య చీటర్.. ఆమె మోసాలతో నాకు సంబంధం లేదు..

    తాళి కట్టాక పెళ్లి కూతురు సినిమా చూపించింది..