వరంగల్ జిల్లాలో వాగులో బైకుతో సహా..

  0
  206

  తెలంగాణ రాష్ట్ర‌వ్యాప్తంగా జోరున వ‌ర్షాలు కురుస్తున్నాయి. డ్యాములు, ప్రాజెక్టులు నిండి కుండ‌ల్లా మారాయి. ఎంతోమంది ప్ర‌జలు ఈ వ‌ర‌ద‌ల్లో చిక్కుకుపోయారు. వీరిని రెస్క్యూ సిబ్బంది సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లిస్తున్నారు. సామాన్య ప్ర‌జానీకం కూడా వ‌ర‌ద‌ల్లో చిక్కుకున్న వారిని ర‌క్షించేందుకు ముందుకు వ‌స్తున్నారు. వ‌రంగ‌ల్ జిల్లాలోనూ హోరున వ‌ర్షాలు ప‌డుతున్నారు. వాగులు, వంక‌లు పోటుమీదున్నాయి.

  న‌ర్సంపేట మండ‌లం గురిజాలా గ్రామంలో కాజ్ వేపై వ‌ర‌ద భీభ‌త్సంగా పారుతోంది. అయితే ఓ ద్విచ‌క్ర వాహ‌న‌దారుడు వ‌ర‌ద ప్ర‌వాహాన్ని దాటేందుకు బైక్ పై ప్ర‌యాణించాడు. అయితే వ‌ర‌ద ఉధృతికి కాజ్ వే మీద నుండి ప‌డి కొట్టుకుపోతున్నాడు. అయితే అక్క‌డే ఉన్న కొంద‌రు యువ‌కులు అప్ర‌మ‌త్త‌మై .. ఆ ద్విచ‌క్ర వాహ‌న‌దారుడిని చాక‌చ‌క్యంగా ప‌ట్టుకుని, అతిక‌ష్టం మీద ర‌క్షించారు. క్ష‌ణం ఆల‌స్య‌మైనా ఆ వ‌ర‌ద‌ల్లో ఆ యువ‌కుడు కొట్టుకునిపోయేవాడు.

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.