చిన్ని కృష్ణుడిని తండ్రి వసుదేవుడు బుట్టలో పెట్టుకుని యమునా నదిని దాటాడని పురాణగాధ. ఎన్నో సినిమాల్లోనూ ఈ దృశ్యం చూశాం. టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి చిత్రంలోనూ ఇలాంటి సీనే ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. తాజాగా అలాంటి రియల్ సీనే తెలంగాణ రాష్ట్రంలోనూ చోటుచేసుకుంది.
తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా కుంతపోతగా వానలు కురుస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రాజెక్టులు నిండిపోయాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నారు. లోతట్టుప్రాంతాలు నీట మునిగాయి. చాలామంది ప్రజలు ఈ వరదల్లో చిక్కుకుపోయారు. ఈ వరదల్లో పెద్దపల్లి జిల్లా మంథనిలో ఓ మూడు నెలల బాలుడు, అతడి కుటుంబం చిక్కుకుపోయింది. దీనిపై సమాచారం అందుకున్న గజ ఈతగాళ్లు ఆ బాలుడి ఇంటికి వెళ్లి ఆ కుటుంబాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించారు.
3 నెలల వయసున్న ఆ బాలుడిని ఓ బుట్టలో పడుకోబెట్టి… రెస్క్యూ టీం సభ్యుడు తన నెత్తిన పెట్టుకుని సురక్షిత ప్రాంతానికి చేర్చాడు. ఆ బాలుడి తల్లిని ఆమె భర్త ఒదిగి పట్టుకుని నీటిని దాటించాడు. అచ్చం బాహుబలి సినిమాలో సీన్ తలపించేలా ఉందీ దృశ్యం. ఎన్డీటీవీకి చెందిన ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఉమా సుధీర్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది.
On a day of #RainRedAlert in #Telangana, a #RealLifeScene that would remind you of #Baahubali: 3-month-old baby boy being rescued in a basket placed over the head even as family wades through chest-level waters at #Manthani #Peddapalli #TelanganaFloods @ndtv @ndtvindia pic.twitter.com/ih7w0cJDr8
— Uma Sudhir (@umasudhir) July 14, 2022