చనిపోడానికి 10నిముషాల ముందు..

  0
  302

  ఆ పడవ తుపానులో చిక్కుకుపోయింది. బయటపటే అవకాశమే లేదు. ఎవరైనా వచ్చి రక్షిస్తారన్న ఆశ కూడా లేదు. ఓవైపు చావుభయం, మరోవైపు సముద్రుడి ఉగ్రరూపం, సూదుల్లా గుచ్చుతున్న వర్షపు చినుకులు, చెవులు తూట్లు పొడుస్తున్న జోరుగాలి, ఏ క్షణాన ముంచెత్తుతాయో తెలియని రాకాసి అలలు.. వీటన్నిటి మధ్య పడవలోని ఓ వ్యక్తి ధైర్యంగా ఓ వీడియో తీశాడు. అదే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీడియో తీసిన వ్యక్తి సముద్రంలో కొట్టుకుపోయినా, పడవలో ఉన్న సెల్ ఫోన్ ఆ ఘటనను ప్రపంచానికి తెలిపింది.

  ఇటీవల అరేబియా సముద్రంలో ఏర్పడిన తౌక్టే తుపాను ధాటికి ముంబై తీరంలో నాలుగు నౌకలు మునిగిపోయాయి. దాదాపు 70 మంది వరకు చనిపోగా మరో 20 వరకు ఆచూకీ ఇంకా దొరకలేదు. అయితే మునిగిపోయిన నాలుగు పడవల్లో వరప్రద కూడా ఒకటి. ప్రమాద సమయంలో పడవలో 13 మంది ఉండగా కేవలం ఇద్దరు మాత్రమే ప్రాణాలతో బతికారు. అయితే తుపాను ధాటికి ఈ పడవ మునిగిపోతున్నప్పుడు ఓ వ్యక్తి ఆ దృశ్యాలు వీడియో తీశాడు. నేవీ అధికారులకు ఆ ఫోన్‌ లభించగా అందులో వీడియోను రిలీజ్‌​ చేశారు.

  ఇవీ చదవండి..

  ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

  కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

  ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

  ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..