అడుక్కునేందుకు బైక్ కొనేశాడు.. సూపర్ సాహూ..

  0
  100

  బిచ్చ‌గాడు… సినిమా కాదు. ఇది నిజం. ట్రై మోటార్ సైకిల్ పై బిచ్చ‌మెత్తుకోవ‌డం ఇత‌ని స్ట‌యిల్. భార్య‌ను వెన‌క కూర్చుబెట్టుకుని .. ఊరూరా తిరుగుతూ ఇలా భిక్షాట‌న చేస్తుంటాడు. విన‌డానికి వింత‌గా ఉన్నా… అస‌లు విష‌యం తెలిస్తే ఔరా అనాల్సిందే.

  ఇత‌ని పేరు సంతోష్ కుమార్ సాహు. నిజంగానే బిచ్చ‌గాడు. గుడి ద‌గ్గ‌ర‌, ట్రాఫిక్ కూడ‌ళ్ళ వ‌ద్ద భిక్షాట‌న చేస్తూ పొట్ట పోసుకుంటున్నారు. అయితే అనారోగ్యం కార‌ణంగా రెండు కాళ్ళు చ‌చ్చుప‌డిపోయాయి. దీంతో ఎక్క‌డికీ వెళ్ళ‌లేని ప‌రిస్థితి. దీంతో భార్య‌ను వెంట బెట్టుకుని ట్రై సైకిల్ మీద అడుక్కుంటూ జీవ‌నం సాగిస్తున్నాడు. కాల‌క్ర‌మేణా అత‌ని భార్య‌కు న‌డుము నొప్పి విప‌రీతంగా రావ‌డంతో.. ఆమె కూడా క‌ద‌లలేని స్థితికి వ‌చ్చేసింది. ఏం చేయాలో అర్ధం కాలేదు. కొన్నాళ్ళు అలాగే గ‌డిచిపోయాయి. ఓ ఐడియా అత‌ని జీవితాన్నే మార్చేసింది.

  భిక్షాట‌న‌తో వ‌చ్చిన సొమ్ముతో ట్రై మోటార్ బైక్ త‌యారు చేయించాడు. తాను, త‌న భార్య కూడా బైక్‌లో కూర్చోవ‌డానికి అనువుగా ఉండేలా త‌యారు చేయించుకున్నాడు. ఇందుకోసం సాహు 90 వేలు ఖ‌ర్చు చేశాడు. అలా త‌యారు చేయించుకున్న ట్రై మోటార్ సైకిల్ పై ఎంచ‌క్కా తిరిగేస్తున్నాడు. ఒక ద‌గ్గ‌రే కూర్చోకుండా.. భార్య‌తో క‌లిసి ఆ బైక్ మీద ఊరూరా తిరుగుతూ భిక్షాట‌న చేస్తున్నాడు. త‌న కాళ్ళు చ‌చ్చుప‌డిపోవ‌డం, భార్య అనారోగ్యం బారిన ప‌డ‌డంతో.. జీవితం దుర్భ‌రంగా ఉండేద‌ని, అయితే ఇప్పుడు ఈ ట్రై మోటార్ సైకిల్ పుణ్య‌మా అని త‌మ జీవితాల్లో మార్పు వ‌చ్చింద‌ని సంబ‌ర ప‌డుతున్నాడు సాహు.

   

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి..