బెర్లె చేప కనిపించింది..అన్వేషణ ఫలించింది..

    0
    917

    విశ్వాంతరాళ రహస్యాల్లాగానే సముద్రగర్భం కూడా అంతులేని రహస్యాలకు, జీవరాశులకు నిలయం. సముద్రంలో బార్లియే చేప అత్యంత అరుదైనది. పసిఫిక్ మహా సముద్రంలో కొన్ని వేల అడుగుల కింద ఈ చేప ఉంటుంది. దీన్ని ఇంతవరకు సముద్ర గర్భ అన్వేషకులు, జీవ శాస్త్రవేత్తలు, 9 సార్లు మాత్రమే చూశారు. ఈ చేపపై పరిశోధనకు ఒక సంస్థను కూడా ఏర్పాటు చేశారు. అప్పుడప్పుడు ఈ చేప జీవన పరిస్థితిని పరిశీలించేందుకు శాస్త్రవేత్తలు చేసే అన్వేషణలో ఎప్పుడో తప్ప ఈ చేప కంటికి కనిపించదు. ఇంతవరకు 5600 దఫాలు శాస్త్రవేత్తలు దీనికోసం అన్వేషణ సాగించారు.

    గతవారం 9వ దఫా ఈచేపను చూసి వీడియో తీశారు. 2132 అడుగుల దిగువన ఒక సబ్ మెరీన్ క్యాప్సూల్ లో పరిశోధనలు చేస్తున్న సముద్ర గర్భ జీవ శాస్త్రవేత్తలకు ఇది కనిపించింది. ఈ చేప తల పారదర్శకంగా ఉంటుంది. తలలోపల భాగాలన్నీ స్పష్టంగా కనిపిస్తుంటాయి. నీలం రంగులో కళ్లు ముందుకు పొడుచుకొచ్చినట్టు ఉంటాయి. కటిక చీకట్లో కూడా ఆ చేప తల, కళ్లు మెరుస్తుంటాయి.

    ఈ చేపను చూసిన థామస్ నోబెల్స్ బృందం ఆనందంతో దగ్గరకు తీసి దాన్ని పరిశీలించింది. ఈ చేప సముద్ర గర్భంలోని బెరింగ్ సముద్రం నుంచి జపాన్, బాజా, కాలిఫోర్నియా సముద్ర భాగాల్లోనే సంచరిస్తుందని నిర్థారించుకున్నారు. సముద్రం అడుగు భాగాన, చీకటిగా ఉన్న ప్రాంతాల్లో 2వేలనుంచి 2600 అడుగుల దిగువన దీని సంచారం ఉంటుంది. ప్రపంచంలో అక్కడక్కడ కొన్ని అక్వేరియాల్లో మాత్రం దీన్ని పరిరక్షిస్తుంటారు.

     

    ఇవీ చదవండి

    పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

    ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

    పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

    తిరుమల నామాల పార్కులో కోడె నాగు.