స్నేహితులే అన్నలై.. చెల్లి పెళ్లి ఘనంగా..

    0
    6116

    కుటంబంలో ఎవరైనా చనిపోతే అంత్యక్రియల తర్వాత బరువు బాధ్యతలు నెత్తికెత్తుకోవాల్సి వస్తుందని ఎవరికి వారు తప్పించుకుని పోయే నేటి కాలంలో తీవ్రవాదుల కాల్పుల్లో చనిపోయిన ఓ స్నేహితుడి చెల్లెలికి దగ్గరుండి వైభవంగా పెళ్లి చేసి, కట్నకానుకలు కూడా ఇచ్చిన సైనికులు స్నేహంలోని పవిత్రతకు నిదర్శనంగా నిలిచారు.

    శైలేంద్ర ప్రతాప్ సింగ్ అనే ఓ సీఆర్పీఎఫ్ జవాను గతేడాది కాశ్మీర్ లోని పుల్వామాలో తీవ్రవాదుల దాడిలో చనిపోయారు. పేదవాడైన శైలేంద్రకు ఓ చెల్లెలు ఉంది. తన చెల్లెలు పెళ్లికోసమే తాను డబ్బులు దాచి పెట్టేవాడినని అప్పుడప్పుడు స్నేహితులకు చెప్పేవాడు.

    ఈ క్రమంలో తీవ్రవాదుల కాల్పుల్లో చనిపోయిన శైలేంద్ర సింగ్ చెల్లెలికి పెళ్లి నిశ్చయమైందనే విషయం తెలిసి, ఆ బెటాలియన్ లోని సీఆర్పీఎఫ్ జవాన్లు అందరూ డబ్బులు వేసుకుని, తామే స్వయంగా కట్నకానుకలు, వస్తు సామగ్రి, నగలు, అన్నీ తీసిచ్చి పెళ్లి ఘనంగా చేశారు. ఆ బెటాలియన్ లోని కానిస్టేబుళ్లందరు కూడా రాయబరేలికి పెళ్లికి తరలి వచ్చారు.

    అన్నగా, అతడు చేసే ఏర్పాట్లన్నీ సాంప్రదాయం ప్రకారం ఆ సీఆర్పీఎఫ్ కెప్టెన్ దగ్గరుండి చేశారు. ఆమెను పెళ్లి మండపం వరకు తీసుకెళ్లి పెళ్లి పనులన్నీ పూర్తి చేశారు. తన కొడుకు లేకపోయినా అతడి స్నేహితులు దగ్గరుండి తన కూతురి పెళ్లి చేయడం తనకెంతో గర్వంగా ఉందని, ఒక్క కొడుకు చనిపోయినా, తనకింతమంది కొడుకులు ఉన్నందుకు సంతోషంగా ఉందని ఆమె తల్లి చెప్పారు. జవాన్లను ఊరంతా ఆలింగనం చేసుకుని అభినందించారు.

    ఇవీ చదవండి

    పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

    ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

    పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

    తిరుమల నామాల పార్కులో కోడె నాగు.