ఒవైసి మజ్లీస్ పార్టీకి డిపాజిట్లు గల్లంతు..

  0
  76

  ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అసదుద్దీన్ నాయకత్వంలోని మజ్లీస్ పార్టీ డిపాజిట్లు పోగొట్టుకుంది. ఆ పార్టీ యుపి ఎన్నికల్లో వంద స్థానాల్లో పోటీచేసింది. 99 సీట్లలో డిపాజిట్లు గల్లంతయ్యాయి. దీంతో తన పార్టీని హైదరాబాద్ నుంచి జాతీయ స్థాయికి పార్టీని విస్తరించాలన్న అసదుద్దీన్ ఆశలు నీరుగారిపోయాయి.

  యుపిలో ముస్లింల ఆధిక్యత ఉన్న నియోజకవర్గాల్లోనే మజ్లీస్ తన పార్టీ తరపున అభ్యర్థులను నిలబెట్టింది. కనీసం 10 సీట్లైనా దక్కించుకోవాలని ఆశ పడింది. అయినా పరాజయమే ఎదురైంది. కనీసం డిపాజిట్లు రాలేదు. 2017 ఎన్నికల్లో కూడా , ముస్లిములు అధికంగావుండే , 38 నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెట్టినా , అప్పుడు కూడా అందరూ డిపాజిట్లు పోగొట్టుకున్నారు.

  ఈ ఎన్నికల్లో ఆ పార్టీ తరపున పోటీచేసి డిపాజిట్ దక్కించుకున్న ఒకే ఒక అభ్యర్థి షాఆలం.. ఇతను ముబారక్ పూర్ నుంచి మజ్లీస్ అభ్యర్థిగా పోటీ చేశారు. విచిత్రంగా , వారణాసి ఉత్తర నియోజకవర్గం నుంచి మజ్లీస్ పార్టీ తరపున , హరీష్ మిశ్రా అనే అభ్యర్థి పోటీచేశాడు. ఇతడుకూడా డిపాజిట్ కోల్పోయాడు..

  హైద్రాబాద్ కేంద్రంగా ఉండే తన పార్టీ తరపున ఉత్తర భారతదేశంలోని , ఏ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగినా , మజ్లీస్ పార్టీ అభ్యర్థులను , నిలబెడుతొంది.. అయితే ఫలితం మాత్రం నిరాశాజనకంగా ఉంది. ఓట్లలో చీలిక తెచ్చి బిజెపికి ఉపయోగపడే రాజకీయంగా తృణమూల్ కాంగ్రెస్ నేత మమతా బెనర్జీ ఇదివరకే , బహిరంగంగా ధ్వజమెత్తింది. ముస్లిం ఓట్ల చీలిక వల్ల నష్టపోయే మరికొన్ని పార్టీలుకూడా ఇదేవిధంగా విమర్శలు చేస్తున్నారు. అయితే అవేమీ పట్టించుకోకుండా ఒవైసి తన పార్టీని జాతీయ స్థాయిలో విస్తరించాలన్న ఆలోచనతోనే ఉన్నారు..

   

  ఇవీ చదవండి… 

  బాబూ , బాబూ అంటూ ముద్దాడుతూ రోదిస్తున్న గౌతంరెడ్డి తల్లి

  మిస్ యూ గౌతమ్.. ఎమోషనల్ అవుతున్న బాల్య మిత్రులు..

  నా భార్య చీటర్.. ఆమె మోసాలతో నాకు సంబంధం లేదు..

  తాళి కట్టాక పెళ్లి కూతురు సినిమా చూపించింది..