నందమూరి బాలకృష్ణకు కరోనా..

  0
  170

  నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు కరోనా సోకింది. స్వయంగా ఆయనే ఈ విషయం వెల్లడించారు. రెండ్రోజులుగా తనను కలిసిన వారు పరీక్షలు చేయించుకోవాలని కోరారు. ప్రస్తుతం తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్టు ప్రకటించిన బాలకృష్ణ.. త్వరలోనే సాధారణ కార్యకలాపాల్లో పాల్గొంటానని ఆశాభావం వ్యక్తం చేశారు.

  కాగా.. బాల‌య్య సినిమాల‌తో ఫుల్ బిజీగా ఉన్నారు. గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో ఒక‌టి, అనిల్ రావిపూడి చిత్రంలో మ‌రొక సినిమా చేస్తున్నారు. ప్ర‌స్తుతం గోపీచంద్ ద‌ర్శ‌క‌త్వంలో జ‌రుగుతున్న సినిమా షూటింగ్‌లో ఆయ‌న పాల్గొంటున్నారు. మ‌రోవైపు ‘అన్‌స్టాపబుల్‌ సీజన్‌-2’తో కూడా రెడీ అయ్యారు. ఈలోగా క‌రోనా పాజిటివ్ రావ‌డంతో… హోమ్ ఐసోలేష‌న్‌లో ఉన్నారు బాల‌య్య‌.

  దేశంలో క‌రోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 17 వేల 336 కోవిడ్ కేసులు న‌మోద‌య్యాయి. ఇది నాలుగు నెలలో 30 శాతం అధికం. గ‌డిచిన 24 గంట‌ల్లో 13 మంది చ‌నిపోయారు. మ‌హారాష్ట్ర‌లో కొత్త‌గా 5వేల కోవిడ్ కేసులు న‌మోద‌య్యాయి. దేశంలో ఇలా క్ర‌మంగా క‌రోనా పాజిటివ్ రోగుల సంఖ్య పెరుగుతుండ‌డంతో కేంద్ర ఆరోగ్య శాఖ కూడా అత్య‌వ‌స‌రంగా స‌మీక్ష జ‌రుపుతోంది. కేర‌ళ‌, క‌ర్నాట‌క‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్, తెలంగాణ‌, హ‌ర్యానా, ఢిల్లీ, త‌మిళ‌నాడు, ప‌శ్చిమ‌బెంగాల్, గుజ‌రాత్ రాష్ట్రాల్లో రోజూ వెయ్యికి పైగా కేసులు న‌మోద‌వుతున్నాయి.

   

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.