పెళ్లి చేసుకున్నా కలసి ఉండలేక..

  0
  1923

  వారిద్దరూ చిన్ననాటి స్నేహితులు, హైస్కూల్ లో వారి మధ్య ప్రేమ చిగురించింది. పెళ్లి చేసుకుని కలసి ఉండాలనుకున్నా కులాలు వేరు కావడంతో కుదరలేదు. ఈలోగా ఇంట్లో పెద్దల మధ్య గొడవలు ముదిరాయి. దీంతో ప్రేమను క్యాన్సిల్ చేసుకుంటున్నామంటూ చెప్పి రహస్యంగా కలుస్తూ వచ్చారు. ఇంట్లో వారికి తెలియకుండా పెళ్లి కూడా చేసుకున్నారు. కానీ చివరికి విధి వక్రించింది. కుర్రాడి మనసు మారిపోయింది. తల్లిదండ్రులను ఎక్కువరోజులు నమ్మించలేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. భార్యకు చెబితే ఒప్పుకోదని తెలిసి, ఆమెను ముందుగానే చంపేసి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మాదాపూర్ లోని లెమన్ ట్రీ హోటల్ లో జరిగింది. గురువారం జరిగిన ఈ వ్యవహారంపై పోలీసులు ఇప్పుడు నిజానిజాలు వెలికి తీశారు.

  మాదాపూర్‌లోని లెమన్‌ట్రీ హోటల్‌లో గురువారం సాయంత్రం యువతి హత్య, యువకుడి ఆత్మహత్య ఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. నారాయణపేట జిల్లా హకీంపేటకు చెందిన జి.రాములు (25), వికారాబాద్‌ జిల్లా బొంరాస్‌పేట మండలం లగచర్లకు చెందిన ఈడిగి సంతోషి (25) ఇద్దరూ హకీంపేటలోని జెడ్పీ హైస్కూలులో కలిసి చదువుకున్నారు. ఆ సమయంలో వారి మధ్య నెలకొన్న స్నేహం తర్వాత ప్రేమగా మారింది. కులాలు వేర్వేరు కావడంతో ఇరు కుటుంబాల వారు పెళ్లికి అంగీకరించలేదు. ఈ విషయంగా చిన్న గొడవలు కూడా జరిగినట్టు తెలిసింది. దీనితో రాములు, సంతోషి విడిపోతామని తమ కుటుంబాలకు చెప్పారు. కానీ తరచూ కలుస్తూ వచ్చారు.

  నెలన్నర రోజుల కిందే ప్రేమ వివాహం చేసుకున్నా.. కుటుంబాలకు తెలియకుండా ఉంచారు. తాజాగా పెళ్లి విషయాన్ని తమ కుటుంబాలకు చెప్పే విషయమై ఇరువురి మధ్య మనస్పర్థలు వచ్చి గొడవకు దారితీసినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే రాములు ఆమెను చంపేసి, తాను ఆత్మహత్య చేసుకున్నాడని.. లెమన్‌ట్రీ హోటల్‌కు వెళ్లేప్పుడే బ్లేడ్‌ను తెచ్చుకున్నాడని పోలీసులు చెప్తున్నారు. కాగా.. సంతోషి, రాములు మృతదేహలకు కుటుంబ సభ్యులు స్వగ్రామాలకు తీసుకెళ్లి అంత్యక్రియలు పూర్తి చేశారు.

  ఇవీ చదవండి..

  ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

  అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

  అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

  నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?