కృత్రిమ గుండె ఖరీదు కోటీ 31లక్షలు..

    0
    825

    ప్రపంచంలోనే మొదటిసారిగా ఒక ఫ్రెంచ్ కంపెనీ కర్మత్ కృత్రిమంగా తయారు చేసిన గుండెను విక్రయించింది. ఇటలీకి చెందిన ఓ పేషెంట్ కి దీన్ని అమరుస్తున్నారు. 2008 నుంచి ఫ్రాన్స్ లోని కర్మత్ కంపెనీ కృత్రిమంగా గుండెను తయారు చేసే మిషన్ పై ప్రయోగాలు చేసింది.

    ఎట్టకేలకు మొదటి పరికరాన్ని 13ఏళ్ల తర్వాత తయారు చేసి ఇటలీ పేషెంట్ కి అమర్చబోతోంది. ప్రఖ్యాత హార్ట్ సర్జన్ డాక్టర్ సీరోమెయిలో ఈ కృత్రిమ పరికరం తయారీలో కీలక పాత్ర వహించారు. నేపుల్స్ లోని హాస్పిటల్ లో కృత్రిమ గుండె భాగాల తయారీలో ఆయన నిష్ణాతులు. 2019నుంచి దీన్ని ప్రయోగాత్మకంగా 11మంది రోగుల్లో అమర్చారు.

    వారిలో 73శాతం మంది రోగులు ఆరు నెలలపాటు బతికారు. దాదాపు చనిపోవడం ఖామని అనుకున్న రోజులకు ఈ కృత్రిమ గుండెను వారి బంధువుల అనుమతితో ప్రయోగాత్మతంగా అమర్చి పరీక్షించారు. ఇప్పుడు వాణిజ్య పరంగా దీన్ని మొట్టమొదటిసారి ఒక పేషెంట్ కి అమర్చబోతున్నారు.

    దీన్ని పేషెంట్ కు అమర్చేందుకు ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే కోటీ 31 లక్షల రూపాయల వ్యయం అవుతుంది. ఇదే సమయంలో అమెరికాలో కూడా ఈ కృత్రిమ గుండెపై క్లినికల్ ట్రయల్స్ మొదలు పెట్టారు.

    ఇవీ చదవండి..

    ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

    అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

    అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

    నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?