భర్త , మానవ బాంబుగా మారి , భార్యను కౌగలించుకొని

  0
  191

  తీవ్రవాదులు , మానవ బాంబులుగా మారి మారణహోమం సృష్టించడం చూసివుంటాం.. అయితే ఓ భర్త , మానవ బాంబుగా మారి , భార్యను కౌగలించుకొని చంపేశాడు.. తానూ చనిపోయాడు.. ఈ దారుణం గుజరాత్ లోని అరవిల్లి ప్రాంతంలో జరిగింది. లాలపాగా అనే వ్యక్తి , శారద భార్యాభర్తలు. 21 ఏళ్ళ కొడుకున్నాడు. కుటుంబకలహాలతో ఇటీవల భార్య పుట్టింటికి వచ్చేసింది.

  దీంతో , భర్త లాలపాగా, భార్యను తనవద్దకు రమ్మని కోరి , అత్తగారింటికి వచ్చాడు. ఇంటిబయటే ఉండి , భార్యను బయటకు రమ్మన్నాడు. తనను కౌగిలించుకోమని కోరాడు. భర్త మనసుమారిందని సంతోషంతో భార్య , భర్తను కౌగిలించుకుంది.. సడెన్ గా , తన శరీరానికి కట్టుకున్న బాంబులను పేల్చుకున్నాడు. ఇద్దరూ , అక్కడికక్కడే చనిపోయారు.. శరీరాలు ముక్కలుముక్కలయ్యాయి.. ఇలాంటి దురాగతం బహుశా , దేశంలో ఇదొక్కటే..

   

  ఇవీ చదవండి… 

  బాబూ , బాబూ అంటూ ముద్దాడుతూ రోదిస్తున్న గౌతంరెడ్డి తల్లి

  మిస్ యూ గౌతమ్.. ఎమోషనల్ అవుతున్న బాల్య మిత్రులు..

  నా భార్య చీటర్.. ఆమె మోసాలతో నాకు సంబంధం లేదు..

  తాళి కట్టాక పెళ్లి కూతురు సినిమా చూపించింది..