ఇదే చివరి ముద్దు.. ఆ తర్వాత..

  0
  4284

  పెద్దలను ఎదిరించి ప్రేమ పెళ్లి చేసుకున్న యువజంట.. ప్రాణ భయంతో పారి పోయింది. ఐదు నెలల తర్వాత భార్యా భర్తలుగా సొంత ఊరికి వచ్చారు వారిద్దరూ. అయినా కూడా వారి ప్రాణాలు నిలవలేదు. సొంత ఊరికి తిరిగొచ్చాక ఆ ప్రేమ జంట.. అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.

  ఈ విషాద ఘటన మైసూరు జిల్లా హుణసూరు తాలూకా సింగర మారనహళ్లిలో జరిగింది. హుణసూరు తాలూకా బిళికెరె హోబళి సింగరమారనహళ్లి గ్రామానికి చెందిన అర్చన (18), రాకేశ్‌ (24) రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. కులాలు వేరు కావడంతో పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకరించలేదు. దీంతో పెద్దలను కాదని ఐదు నెలల క్రితం ఇంటినుంచి వెళ్లిపోయి వేరోచోట పెళ్లి చేసుకున్నారు. మైసూరులో కాపురం పెట్టారు.

  మరో వైపు తమ పిల్లలు కనిపించడం లేదనివారి తల్లిదండ్రులు సెప్టెంబర్‌ లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో అర్చన, రాకేశ్‌లు సింగరమారనహళ్లి గ్రామానికి వచ్చారు. ఏం జరిగిందో ఏమో ఆ తర్వాతి రోజే ఊరు శివార్లలోని పొలంలో చెట్టుకు వేలాడుతూ శవాలుగా కనిపించారు. పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకొని ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు మొదలు పెట్టారు.

  ఇవీ చదవండి… 

  బాబూ , బాబూ అంటూ ముద్దాడుతూ రోదిస్తున్న గౌతంరెడ్డి తల్లి

  మిస్ యూ గౌతమ్.. ఎమోషనల్ అవుతున్న బాల్య మిత్రులు..

  నా భార్య చీటర్.. ఆమె మోసాలతో నాకు సంబంధం లేదు..

  తాళి కట్టాక పెళ్లి కూతురు సినిమా చూపించింది..