మంత్రిగారూ ..ఏమిటీ మోకాళ్ళసేవ .

  0
  137

  రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ ఓవరాక్షన్ ఇప్పుడు తీవ్రమైన చర్చకు దారి తీసింది. వ్యక్తి ఆరాధన విషయంలో వైసీపీ కూడా అన్నాడీఎంకే ని తలదన్నే విధంగా ఉందంటూ విమర్శలు వినిపిస్తున్నాయి . అమలాపురం లో జరిగిన వైసీపీ నేత కుడిపూడి చిట్టబ్బాయి ప్రధమ వర్ధంతి సభలో మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ , టిటిడి చైర్మన్ వై వి సుబ్బారెడ్డికి మోకాళ్ళపై వంగి , మోకరిల్లి నమస్కారం పెట్టడమే ఇప్పుడు రాజకీయ విశేషమైంది. వై వి సుబ్బారెడ్డి ఇప్పుడు వైసిపి ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త గా ఉన్నారు . బీసీ సంక్షేమం మరియు సమాచార ప్రసార శాఖ మంత్రిగా ఉన్న చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ , వై వి సుబ్బారెడ్డి ముందు , నిండు సభలో మోకాళ్ళతో మోకరిల్లి రెండు చేతులు జోడించి నమస్కరించి ప్రాధేయ పూర్వకమైన విజ్ఞప్తి చేయడం విశేషం .

  మంత్రివర్గ విస్తరణ సమయంలో కొంతమంది మంత్రులు ముఖ్యమంత్రి జగన్ కు పాదాభివందనాలు చేసినప్పటికీ , అదేం పెద్ద విశేషంగా కనిపించలేదు. దాని గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. అయితే రాష్ట్ర మంత్రిగా ఉన్న వ్యక్తి , వై వి సుబ్బారెడ్డి ముందు ఇలా మోకాళ్ళ మీద మోకరిల్లి నమస్కరించి విధేయత చాటుకోవడమే ఇప్పుడు విశేషమైనది . శెట్టిబలిజలకు మంత్రివర్గంలో విశేషమైన స్థానం కల్పించడం ముఖ్యమంత్రి జగన్ తో పాటు సుబ్బారెడ్డి పాత్ర కూడా ఉందంటూ ఆయన కృతజ్ఞతలు చెప్పుకున్నారు .

  అదీకాకుండా చిట్టబ్బాయి కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకున్న ముఖ్యమంత్రి జగన్ ,మరియు టిటిడి బోర్డు చైర్మన్ వై వి సుబ్బారెడ్డి కృతజ్ఞతలు చెప్పుకునేందుకు తాను మోకాళ్ళ మీద ఉంది నమస్కరించుకున్నానని మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ చెప్తున్నారు మంత్రి ఇలా చేయడాన్ని వేదిక మీద ఉన్న వారే కాదు సభలో ఉన్నవారు కూడా ఖంగు తిన్నారు . ఒక్కసారిగా ఎవరు మాట్లాడలేని పరిస్థితి అయిపోయింది. మంత్రి వేణు గోపాల కృష్ణ మోకాళ్ళ నమస్కారం ఒక రకంగా వై.వి.సుబ్బారెడ్డి కూడా ఇబ్బంది పెట్టినట్టు అయింది ఆయన కూడా మంత్రి వైపు ఇబ్బందిగా చూస్తూ ఉండిపోయారు.

   

  ఇవీ చదవండి… 

  బుల్లెట్ బండెక్కి వచ్చింది పాప .. సూపర్..

  మెగా ఫ్యామిలీకి ఏమిటీ శాపం..నాగబాబుకు ఇక నోరెత్తలేని పరిస్థితి.

  ఎమ్మెల్యే మేకపాటి రెండో భార్య శాంతమ్మ మాటలు వెనుక అసలు కథేమిటో చూడండి.. ??

  ఆత్మకూరు నర్సు , ఒక ప్రియుడితో మరో ప్రియుడిని కారుతో ఢీకొట్టించి ఎలా చిక్కిందో చూడండి.