ఆచార్య హాల్స్ ఇలా ఖాళీ అయ్యాయి..

  0
  448

  మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణంగా ఫ్లాప్ కావడంతో మెగా అభిమానుల్లో నిరాశ నెలకొంది. చిరంజీవిని కూడా ఒకరకంగా ఆలోచనలో పడవేసింది . చిరంజీవి సినిమా చరిత్రలో ఇంత దారుణమైన ఫ్లాప్ ఇటీవల కాలంలో లేదు . తన కంటే చిన్న హీరోలు సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవుతుంటే ఈ సీజన్లో చిరంజీవి ఆచార్య సినిమా మరో సన్ ఆఫ్ ఇండియా గా మారడం దారుణం . మోహన్ బాబు సన్ ఆఫ్ ఇండియా ఎంత ఘోరంగా విఫలమయిందో , ఈ సినిమా విషయంలో కూడా అంచనాలు అలాగే తయారయ్యాయి . సినిమా రిలీజ్ కి ముందు ప్రమోషన్లు ఏవీ పనికిరాలేదు. ఆచార్య సినిమా అసలు ఓపెనింగ్స్ లేకపోవడం అనేది విచిత్రం . అంటే సినిమా చూసిన తర్వాత సినిమాల గురించి వ్యాఖ్యలు చేయడం ఒకరకమైతే, అసలు సినిమాకు పోకుండా ఉండడం మరో విశేషం.

  చిరంజీవి సినిమా అంటేనే సినిమా హాల్ దగ్గర ఒక జోష్ ఉంటుంది. అందులోనూ , కొడుకు రామ్ చరణ్ తో కలిపి చేసిన సినిమా కాబట్టి , ఓపెనింగ్స్ బాగా ఉంటాయని అనుకున్నారు. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే మార్నింగ్ షో నుంచి నైట్ షో వరకు సినిమా హాల్ కి ప్రేక్షకులు ఎక్కలేదు. సినీ ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం ఆచార్య సినిమా మొదటిరోజు 61.22 శాతం మాత్రమే ఆక్యుపెన్సీ ఉంది. ఎలా ఉందొ చూడండి.. మార్నింగ్ షో.. 58.94, మధ్యాహ్నం షో .. 56.68 సాయంత్రం షో.. 62.02 రాత్రి షో : 67.22 మాత్రమే హాల్స్ నిండాయి..

  సగటున మొదటిరోజు 61. 22 శాతం మంది మాత్రమే ఉంది . ప్రాంతాలవారీగా చూసుకుంటే విజయవాడ విశాఖపట్నం గుంటూరు కాకినాడ జిల్లాలలో మాత్రమే ఆక్యుపెన్సీ కొంచెం మెరుగు లో ఉంది . మిగతా ఏరియాల్లో చాలా తక్కువగా ఉంది కలెక్షన్ల విషయంలో కూడా ఆచార్య సినిమా మొదటి రోజు 35 కోట్లు మాత్రమే ఇది ఇండియా స్థాయిలో కలెక్షన్ ఉంది. ఇది మరీ దారుణం. రామ్ చరణ్ కూడా నటించిన ఈ సినిమాలో పూజ హెగ్డే, సోనూసూద్ ముఖ్యమైన పాత్రల్లో నటించారు . ఈ సినిమా పరాజయం చిరుని , పాత్రల ఎంపికలో ఆలోచనలో పడేసింది.

  ఇవీ చదవండి… 

  బుల్లెట్ బండెక్కి వచ్చింది పాప .. సూపర్..

  మెగా ఫ్యామిలీకి ఏమిటీ శాపం..నాగబాబుకు ఇక నోరెత్తలేని పరిస్థితి.

  ఎమ్మెల్యే మేకపాటి రెండో భార్య శాంతమ్మ మాటలు వెనుక అసలు కథేమిటో చూడండి.. ??

  ఆత్మకూరు నర్సు , ఒక ప్రియుడితో మరో ప్రియుడిని కారుతో ఢీకొట్టించి ఎలా చిక్కిందో చూడండి.