ఏపీలో వినాయక చవితి ఉత్సవాలపై ఆంక్షలు..

  0
  1659

  ఏపీలో వినాయక చవితి ఉత్సవాలపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. పండగను కేవలం ఇళ్లకు మాత్రమే పరిమితం చేయాలని ఆదేశాలిచ్చింది. ఇళ్లల్లో విగ్రహాలు పెట్టుకునేందుకు మాత్రమే అనుమతి ఇవ్వాలని, పబ్లిక్‌ స్థలాల్లో విగ్రహాలు వద్దని, నిమజ్జన ఊరేగింపులు చేయకూడదని సీఎం జగన్ సమీక్షలో నిర్ణయించారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తలు తప్పవని సీఎం పేర్కొన్నారు. కొవిడ్‌ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు రాష్ట్రంలో ప్రస్తుతం రాత్రి పూట అమలు చేస్తోన్న కర్ఫ్యూ మరి కొంత కాలం కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్‌ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో కొవిడ్‌ నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్‌ పై సీఎం సమీక్షించారు. వినాయకచవితి ఉత్సవాలను ఇళ్లకే పరిమితం చేయాలని వైద్యుల సిఫార్సు మేరకు నిర్ణయం తీసుకున్నారు.

  ఇవీ చదవండి..

  రేపిస్టులను పట్టడంలో ఆ కుక్క దిట్ట..

  ఇద్దరమ్మాయిల సహజీవనానికి అనుమతిఇస్తూ..

  తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..

  పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్