మంత్రి ర్యాలీ వల్ల పాప చనిపోయిందా..? నిజమేంటో చూడండి..

  0
  292

  అనంతపురం జిల్లా కల్యాణ దుర్గంలో మంత్రి ఉషశ్రీ చరణ్ ర్యాలీ కారణంగా ఓ పసిపాప ఆస్పత్రికి వెళ్లడం ఆలస్యమై చనిపోయిందంటూ వచ్చిన కథనాలను అనంతపురం జిల్లా పోలీసులు ఖండించారు. వాస్తవం ఇదీ అని సీసీ టీవీ ఫుటేజీ బయటపెట్టారు. అమ్మాయికి ఫిట్స్ రావడంతో వారి తల్లిదండ్రులు పాపను బైక్ పై ఎక్కించుకుని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో ర్యాలీ వల్ల వారు ఆస్పత్రికి వెళ్లడం ఆలస్యమైందనేది ఫిర్యాదు. కానీ ఆ పాపను ఆస్పత్రికి తీసుకెళ్లే క్రమంలో ఎక్కడా వారికి ట్రాఫిక్ అవాంతరం ఎదురు కాలేదని పోలీసులు చెబుతున్నారు. తప్పుడు కథనాలు రాసిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈమేరకు పోలీసులు సీసీ టీవీ ఫుటేజీని విడుదల చేశారు.

  ఇవీ చదవండి… 

  బుల్లెట్ బండెక్కి వచ్చింది పాప .. సూపర్..

  మెగా ఫ్యామిలీకి ఏమిటీ శాపం..నాగబాబుకు ఇక నోరెత్తలేని పరిస్థితి.

  ఎమ్మెల్యే మేకపాటి రెండో భార్య శాంతమ్మ మాటలు వెనుక అసలు కథేమిటో చూడండి.. ??

  ఆత్మకూరు నర్సు , ఒక ప్రియుడితో మరో ప్రియుడిని కారుతో ఢీకొట్టించి ఎలా చిక్కిందో చూడండి.