వీడొక సోమరి దొంగ.. దొంగతనానికి పోయి నిద్రపోయాడు.

  0
  151

  వీడొక సోమరి దొంగ.. దొంగతనానికి పోయి, చలికి బయటకు పోలేక షాపులోనే పడుకొని నిద్రపోయాడు. మధ్యప్రదేశ్ లోని జబల్పూర్ లో , చలి తీవ్రంగా ఉంది.. దీంతో షాపులు ఏడు గంటలకే మూసేస్తున్నారు. దీంతో ఒక షాపును దోచుకోవాలని దొంగ ఎంచుకున్నాడు. షాపు మూసేయడంతోనే , షట్టర్ తాళాలు పగులకొట్టి , లోపలి వెళ్ళాడు. కావలసిన వస్తువులన్నీ పోగేసుకొని , మూట కట్టేసాడు. చలిఎక్కువగా ఉండటంతో షాపులుకూడా ఉదయం 11 గంటలకు తీస్తారు. రాత్రి రోడ్లుకూడా నిర్మానుష్యంగా ఉంటాయి. దీంతో , దొంగ తొందరేముందిలే అనుకోని , షాపులో ఉన్న రగ్గు కప్పుకొని పడకేసాడు.. ఉదయం వరకు నిద్రలేవలేదు. ఓనర్ వచ్చి , షట్టర్ తాళాలు తీసిఉండటంతో , పోలీసులకు చెప్పాడు. అందరూ కలిసి లోపలికి వెళ్లి , నిద్రపోతున్న దొంగను లేపి , ఒక కప్పు టీ ఇచ్చి , స్టేషన్ కి తీసుకెళ్లారు..

   

  ఇవీ చదవండి… 

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.