ఆనంద‌య్య మందును టీటీడీ వద్దంది..

  0
  38

  ఆనంద‌య్య మందును టీటీడీ ఆయుర్వేద ఫార్మ‌సీలో త‌యారు చేసే ప్ర‌తిపాద‌న‌ను విర‌మించుకుంది. ఈ విష‌యాన్ని టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఆనంద‌య్య మందు ఆయుర్వేదం మందు కాద‌ని, కేంద్ర ఆయుష్ శాఖ నివేదిక ఇచ్చింద‌ని దాన్ని నాటుమందుగానే ప‌రిగ‌ణించాల‌ని, అందువ‌ల్ల ఆయుర్వేదం మందు త‌ప్ప‌, ఇత‌ర మందుల‌ను టీటీడీ ఆయుర్వేద ఫార్మ‌సీలో త‌యారు చేయ‌ర‌ని అన్నారు. ఈ కార‌ణంగానే మొద‌ట్లో భావించిన‌ట్లు ఈ మందును త‌యారు చేసే ప్ర‌తిపాద‌న‌ను విర‌మించుకున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు.

  ఆనంద‌య్య మందుతో కోవిడ్ త‌గ్గుతుంద‌ని చెప్ప‌లేద‌ని, అలాగ‌ని వాడొద్ద‌ని సూచించ‌లేద‌ని, నిర్ణ‌యాన్ని ప్ర‌జ‌లకే వ‌దిలేశార‌ని తెలిపారు. వాస్త‌వంగా ఈ మందును మొద‌ట టీటీడీ ఆయుర్వేద ఫార్మ‌సీలో త‌యారు చేయించి ఇవ్వాల‌ని నిర్ణ‌యించుకున్నామ‌ని, అయితే ప్ర‌స్తుతానికి ఆ ఆలోచ‌న లేద‌న్నారు. భ‌విష్య‌త్తులో ఈ మందుపై మెరుగైన రిపోర్టు వ‌స్తే అప్పుడు ప‌రిశీలిస్తామ‌న్నారు.

  ఇవీ చదవండి..

  ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

  కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

  ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

  ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..