అల్లరిపిల్ల ఎక్కడుంది.. ? అమ్మో ఎంత చీటింగ్ ..

  0
  570

  అల్లరిపిల్ల ఫేస్ బుక్ ఖాతాతో అబ్బాయిలను బుట్టలోవేసుకొని , లక్షలు కొల్లగొట్టేసిన కేసులో బ్రోకర్లు అరెస్టయ్యారు. అల్లరిపిల్ల మాత్రం పరారీలో ఉంది.. అల్లరిపిల్ల పేరుతొ ఒక ఫేస్ బుక్ అకౌంట్ ఉంది. అల్లరిపిల్ల మగాళ్లకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పాపముంటుంది. అల్లరిపిల్లకదా , అందులో ఆడపిల్ల , అబ్బో ఎంత అల్లరిచేస్తుందో అని మగాళ్లు పాపం , ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపేవాళ్లు.. దీంతో వాళ్ళను బుట్టలో వేసుకొని, చాటింగ్ మొదలు పెట్టేది , తరువాత నగ్నంగా కాల్స్ చేసేది. ఇందుకోసం అల్లరిపిల్ల ఒక లింక్ పంపేది. ఆ లింక్ ఓపెన్ చేయమని అడిగేది. అది ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే , అల్లరిపిల్ల లింక్ ఓపెన్ చేసిన అబ్బాయిల మొబైల్ ఫోన్ , అల్లరిపిల్ల కంట్రోల్ లోకి వెళ్ళిపోతుంది.

  పాపం , అబ్బాయిలకు , ఆమె చాటింగ్ , నగ్న కాల్స్ మోజులో ఏమి జరుగుతుందో తెలుసుకునే లోపు , వాళ్ళ బ్యాంకు అకౌంట్లలో డబ్బులన్నీ అల్లరిపిల్ల ఏజెంట్ల ద్వారా , వాళ్ళ ఖాతాలలోకి ట్రాన్స్ఫర్ అయిపోయేవి.. దీంతో అబ్బాయిలు తేలుకుట్టిన దొంగల్లా ఉండిపోయేవారు. చివరకు చిత్తూరు కు చెందిన , ఓ వ్యక్తి అల్లరిపిల్ల వలలో పడి , సికె మౌనిక్ అనే అబ్బాయి 3 లక్షల , 64 వేల రూపాయలు పోగొట్టుకున్నాడు. తాను మోసపోయిన విషయాన్నీ పోలీసులకు చెప్పాడు.

  ఎస్పీ సెంథిల్ కుమార్ , దీన్ని ప్రతిష్టాకరమైన కేసుగా భావించి , డిఎస్పీ సుధాకరరెడ్డికి అప్పజెప్పారు. వారం రోజుల్లో అల్లరిపిల్ల బ్రోకర్లను పోలీసులు పట్టేశారు. అల్లరిపిల్ల మాత్రం పరారీలో ఉంది. ఈ అల్లరిపిల్ల బ్రోకర్లు , రాష్ట్రం నలుమూలల విస్తరించి ఉన్నారు. అరెస్టైన బ్రోకర్లలో వైజాగ్ కి చెందిన సాంబశివరావు , శ్రీను , కుమార్ , మహేష్ , ఆనంద్ , కడపకు చెందిన సుధీర్, వరంగల్ కి చెందిన శ్రావణ్ ఉన్నారు. అల్లరిపిల్ల మానస పరారీలో ఉంది..

  ఇవీ చదవండి… 

  బాబూ , బాబూ అంటూ ముద్దాడుతూ రోదిస్తున్న గౌతంరెడ్డి తల్లి

  మిస్ యూ గౌతమ్.. ఎమోషనల్ అవుతున్న బాల్య మిత్రులు..

  నా భార్య చీటర్.. ఆమె మోసాలతో నాకు సంబంధం లేదు..

  తాళి కట్టాక పెళ్లి కూతురు సినిమా చూపించింది..