ఉక్రెయిన్లో పాక్ యువతిని భారత్ అధికారులు ఇలా కాపాడారు..

  0
  149

  యుద్ధంతో అల్లకల్లోలంగా ఉన్న ఉక్రెయిన్ లో , ఓ పాకిస్తానీ యువతి , భారత దేశానికి కృతజ్ఞతలు చెప్పుకుంది.. కీవ్ లోని ఒక రీజియన్లో ప్రజలు బయటకు వచ్చెనందుకు వీలులేకుండా బాంబులు పడుతున్నాయి. కాల్పుల మోతతో ఆ ప్రాంతం దద్ధరిల్లి పొతొంది. ఈ పరిస్థితుల్లో అస్మా షఫీక్ అనే పాకిస్తాన్ యువతి , భారత ఎంబసీని సంప్రదించింది. తనను ఎలాగైనా , ఇక్కడనుంచి బయటకు తీసుకెళ్లి , తన దేశానికీ పంపాలని కోరింది. తమ ఎంబసీ అధికారులు అందుబాటులోకి రావడంలేదని చెప్పింది.

  దీంతో ఉక్రెయిన్ లో ఎంబసీ అధికారులు ఈ విషయాన్నీ మన విదేశాంగశాఖకు తెలిపారు. వెంటనే ఆ అమ్మాయిని రక్షించి , సురక్షిత ప్రాంతానికి తరలించమని చెప్పారు. దీంతో , ఉక్రెయిన్లోని భారత ఎంబసీ ఒక ప్రత్యేక ఆపరేషన్ ద్వారా , అస్మా షఫీక్ అనే పాకిస్తాన్ యువతి సురక్షిత ప్రాంతానికి తరలించింది. దీంతో అస్మా షఫీక్ , ప్రధానమంత్రి మోడీకి , భారత ఎంబసీ అధికారులకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ ట్విట్టర్లో వీడియో పెట్టింది..

   

  ఇవీ చదవండి… 

  బాబూ , బాబూ అంటూ ముద్దాడుతూ రోదిస్తున్న గౌతంరెడ్డి తల్లి

  మిస్ యూ గౌతమ్.. ఎమోషనల్ అవుతున్న బాల్య మిత్రులు..

  నా భార్య చీటర్.. ఆమె మోసాలతో నాకు సంబంధం లేదు..

  తాళి కట్టాక పెళ్లి కూతురు సినిమా చూపించింది..