నారా లోకేష్ ని తిట్టిన వెంకట్.. తెరపైకొచ్చాడు..

  0
  1556

  మంగళవారం సోషల్ మీడియాలో వైరల్ అయిన అచ్చెన్నాయుడి వీడియోలో కనపడకుండా వినిపించిన వాయిస్ వెంకట్ అలియాస్ ఆకుల వెంకటేశ్వరరావుది అని తేలింది. హైదరాబాద్ కి చెందిన ఈయన 30ఏళ్లుగా టీడీపీలోనే ఉన్నారట, ఓ సారి టీడీపీ టికెట్ పై హైదరాబాద్ లో కార్పొరేటర్ గా కూడా పోటీ చేశారట. అయితే హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ప్రాంతంలో కేఎల్ నారాయణ అనే వ్యక్తితో వెంకట్ కి భూ వివాదం నడుస్తోంది. దీంట్లో తనకి సాయం చేయాలంటూ చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణ చుట్టూ తిరిగారు వెంకట్. వారి నుంచి సరైన సమాధానం రాకపోయే సరికి చివరకు రివర్స్ అయ్యారు. అచ్చెన్నాయుడుతో హోటల్ గదిలో జరిగిన సంభాషణను రికార్డ్ చేసి వైరి వర్గానికి అందించారు. ఆ తర్వాత మీడియా ముందుకొచ్చారు. చంద్రబాబు వల్ల తనకు ప్రాణహాని ఉందని, ఇప్పటికే కొంతమంది ఫోన్లు చేసి తనను చంపేస్తామని బెదిరిస్తున్నారంటూ వాపోయారు. తిరుపతి వెస్ట్ పోలీసులకు ఆయన ఈమేరకు ఫిర్యాదు చేశారు.

  ఇవీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.