నకిలీ కోవిడ్ రిపోర్ట్ కేసులో భూమా అఖిలప్రియ భర్త భార్గవ్.

  0
  319

  టిడిపి నాయకురాలు , మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ , నకిలీ కోవిడ్ రిపోర్ట్ కేసులో ఇరుక్కున్నాడు. ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నాడు. హైదరాబాద్ లో భూవివాదంలో , ప్రవీణ్ రావు కుటుంబ సభ్యులను కిడ్నాప్ చేసిన కేసులో మొదట ఆయన పరారీలో ఉన్నాడు. తర్వాత కేసు కోర్టుకు చేరింది. ఈ విషయమై కోర్టులో విచారణకు హాజరు కావలసి ఉంది. అయితే తనకు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయిందని , అందువల్ల కోర్టుకు రాలేనని భార్గవ్ రామ్ పోలీసులకు వాట్సాప్ లో , ల్యాబ్ రిపోర్ట్ పంపాడు. ఈ రిపోర్ట్ నకిలీదని అనుమానించిన ఉన్నతాధికారులు , విచారణకు ఆదేశించారు. రిపోర్ట్ ఇచ్చిన గాయత్రీ లాబ్స్ లో విచారణచేస్తే , మోసం బయటపడింది. డబ్బులు తీసుకొని కరోనా పాజిటివ్ రిపోర్ట్ ఇచ్చామని ల్యాబ్ సిబ్బంది చెప్పారు. దీంతో ఇద్దరు ల్యాబ్ సిబ్బందిని అదుపులోకి తీసుకొని , భార్గవ్ రామ్ పై మరో కేసుపెట్టారు. అతడిని అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.