ఒక్కడు సినిమా స్టయిల్లో..చివరకు హ్యాపీ వెడ్డింగ్.

  0
  1298

  ఒక్క‌డు సినిమా చూశారా ? అయితే ఆ సినిమాలో మ‌హేష్ బాబు త‌న ఇంట్లో, త‌న గ‌దిలో త‌ల్లిదండ్రుల‌కు తెలియ‌కుండా భూమిక‌ను దాచి పెడ‌తాడు. స‌రిగ్గా అలాంటి సీన్ రియ‌ల్ లైఫ్ లోనూ జ‌రిగింది. ఒక‌రోజు కాదు, రెండు రోజులు కాదు… ఏకంగా ప‌ద‌కొండు సంవ‌త్స‌రాల పాటు, త‌న ప్రేయ‌సిని ప్రియుడు త‌న ఇంట్లో, త‌న గ‌దిలో దాచి పెట్టాడంటే న‌మ్ముతారా ? న‌మ్మాలి. ఎందుకంటే ఇది ప‌చ్చి నిజం కాబ‌ట్టి. దేశ‌వ్యాప్తంగా ఈ ప్రేమికుల జంట సంచ‌ల‌నం సృష్టించింది. కేర‌ళ‌లోని పాల‌క్క‌డ్ ప్రాంతంలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది.

  వివ‌రాల్లోకి వెళితే…కేరళలోని పాలక్కాడ్ జిల్లాలోని అయిలూర్ గ్రామానికి చెందిన రెహ్మాన్, సాజిత ప్రేమించుకున్నారు. ఇంట్లో వీరి ప్రేమ ఒప్పుకోరని భావించి, ఆ యువతి ప్రియుడి వద్దకు వచ్చేసింది. అప్ప‌టి నుంచి ఆమె అత‌ని ఇంట్లో, అత‌ని గ‌దిలోనే ఉండిపోయింది. త‌న గ‌దిలోకి కుటుంబ‌స‌భ్యుల‌ను కూడా రానివ్వ‌కుండా జాగ్ర‌త్త ప‌డ్డాడు. భోజ‌నం కూడా త‌న గ‌దిలోకే తీసుకెళ్ళేవాడు. ఇద్ద‌రూ చెరిస‌గం తినేసి ప‌డుకునేవారు. ఇక సాజిత ప్ర‌పంచ‌మంతా ఆ గ‌దిలోనే. ఆమె కాల‌కృత్యాల‌న్నీ రాత్రి వేళ్ళ‌ల్లోనే. అంద‌రూ నిద్ర పోయాక కాసేపు మాత్ర‌మే బ‌య‌ట‌కి వ‌చ్చేది. మిగిలిన రోజంతా ఆ చిన్న‌గ‌దిలోనే. ఈ ఘ‌ట‌న 2010 నుంచి మొద‌లైంది.

  ఇక సాజిత క‌నిపించ‌డం లేద‌ని త‌ల్లిదండ్రులు పోలీస్ కేసు పెట్టారు. మిస్సింగ్ కేసు న‌మోదు చేసిన పోలీసులు అప్ప‌టి నుంచి ఆమెను వెదుకుతూనే ఉన్నారు. కానీ జాడ మాత్రం క‌నిపెట్ట‌లేక‌పోయారు. అయితే కోవిడ్ కార‌ణంగా రెహ్మాన్ కు సంపాద‌నకు లేక‌పోవ‌డంతో.. ఓరోజు సాజిత‌ని తీసుకుని విత‌న‌స్స‌రీ అనే ప్రాంతానికి వ‌ల‌స‌పోయాడు. అక్క‌డే కాపురం పెట్టాడు. చెప్పాపెట్ట‌కుండా రెహ్మాన్ ఇంటి నుంచి వెళ్ళిపోవ‌డంతో, అత‌ని సోద‌రుడు పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. అప్ప‌టి నుంచి రెహ్మాన్ కోసం పోలీసులు వెదుకుతున్నారు. ఈక్రమంలో రెహ్మాన్‌, సాజిత‌ను బైక్ మీద వెళుతుండ‌డం చూసిన రెహ్మాన్ సోద‌రుడు పోలీసుల‌కు స‌మాచారం ఇవ్వ‌డంతో… ఈ ప్రేమ‌క‌ధ అంతా బ‌య‌ట‌ప‌డింది. దీంతో పోలీసుల‌తో స‌హా అంద‌రూ బిత్త‌ర‌పోయారు.ఒక ఇంట్లో.. అందులోనూ ఓ చిన్న‌గ‌దిలో.. ప‌ద‌కొండేళ్ళు త‌న ప్రియురాలిని దాచాడు రెహ్మాన్‌. ఈ విష‌యం తాజాగా వెలుగులోకి రావ‌డంతో.. ఈ ప్రేమ‌జంట దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌న‌మైంది. ఏదైతేనేం.. పెళ్ళికి ఒప్పుకోర‌ని భావించి, ఇన్నేళ్ళు క‌లిసి ఉంటున్న ఆ ప్రేమ‌జంట ఇప్పుడు ఒక ఇంటి వార‌య్యారు. ఇద్ద‌రూ పెళ్ళి చేసుకున్నారు. రిజిస్ట్రార్ ఆఫీసులో దండ‌లు మార్చుకుని దంప‌తుల‌య్యారు. ఇక చేసేది లేక పెద్ద‌లు కూడా ఈ జంట‌ను దీవించారు. ఈ విష‌యం తెలుసుకున్న పాల‌క్క‌డ్ ఎమ్మెల్యే బాబు నూత‌న దంప‌తుల‌ను ఆశీర్వ‌దించారు.

  ఇవీ చదవండి..

  మాజీ సిఎం భార్య చెల్లెలు, ఫుట్ పాత్ పై యాచన.

  25 సార్లు లేచిపోయింది.. అయినా క్షమించిన భర్త .

  తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..

  పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్