చదువులేకుండానే మేం మంత్రులమయ్యాం కదా..?

  0
  166

  ప్రపంచం భయపడుతున్నట్టే జరుగుతోంది. ఆఫ్ఘనిస్తాన్ లో ప్రభుత్వం కూడా ఏర్పాటు చేసిన తాలిబన్లు.. అక్కడి విద్యా వ్యవస్థను నాశనం చేసేందుకు కంకణం కట్టుకున్నారని అర్థమవుతోంది. తాలిబన్ విద్యా శాఖ మంత్రి మాటలు వింటే ఇక అక్కడ స్కూళ్లు, కాలేజీలు ఏవీ ఉండవని అనుమానించాల్సిందే. షేక్ మోల్వీ నూరుల్లా మునీర్ తాజాగా తాలిబన్ల ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి అయ్యారు. డిగ్రీలు, పీజీలు, పీహెచ్డీలు దండగ అని, వాటి వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని విద్యార్థులకు చెబుతున్నారు మోల్వీ. డిగ్రీకి, పీహెచ్డీకి విలువ లేదని, ముల్లాలు, తాలిబన్లు ఏం చదివి అధికారంలోకి వచ్చారని ప్రశ్నిస్తున్నారు. తాలిబన్లకు కనీసం హైస్కూల్ చదువు కూడా లేదని, అందరం గొప్పవాళ్లం అయ్యామని, నాయకులం అయ్యామని, మంత్రి పదవుల్లో కూర్చున్నామని, తమనే ఆదేర్శంగా తీసుకోవాలని చెప్పారు. చదువుకుంటే చెడిపోతారు కానీ బాగుపడరని సందేశమిచ్చారు.

  ఇవీ చదవండి..

  రేపిస్టులను పట్టడంలో ఆ కుక్క దిట్ట..

  ఇద్దరమ్మాయిల సహజీవనానికి అనుమతిఇస్తూ..

  తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..

  పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్