సాయి ధరమ్ తేజ్ రోడ్ యాక్సిడెంట్ కు అరగంట ముందు..

  0
  1347

  సాయి ధరమ్ తేజ్ రోడ్ యాక్సిడెంట్ కి గురయ్యే ముందు నరేష్ ఇంటినుంచి బయలుదేరాడని తెలుస్తోంది. నరేష్ కొడుకు నవీన్ విజయ కృష్ణ, సాయి మంచి స్నేహితులు. తరచూ వీరిద్దరు మరో ఇద్దరితో కలసి హైదరాబాద్ రోడ్లపై డ్రైవింగ్ కి వెళ్తుంటారు. యాక్సిడెంట్ జరిగే రోజు కూడా నవీన్ విజయ కృష్ణతో కలసి సాయి బయటకు వెళ్లాడు. అయితే సాయి అనుకోకుండా ప్రమాదానికి గురయ్యాడు.

  ఈ క్రమంలో నరేష్ ఓ సెల్ఫీ వీడియో విడుదల చేశారు.
  అందులో ఏముందంటే..?

  ‘సాయిధరమ్‌ తేజ్‌ నా బిడ్డలాంటివాడు. తను కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. నా కుమారుడు నవీన్‌ విజయ కృష్ణ-సాయి మంచి స్నేహితులు. అన్నదమ్ముల్లా ఉంటారు. నిన్న సాయంత్రం వాళ్లిద్దరూ ఇక్కడి నుంచే బయలుదేరారు. బైక్‌పై స్పీడ్‌గా వెళ్లొద్దని చెప్పాలనుకుని బయటకు వచ్చేసరికే.. వాళ్లు బయలుదేరిపోయారు. నాలుగు రోజుల క్రితం కూడా వీళ్లిద్దరికీ కౌన్సెలింగ్‌ ఇవ్వాలనుకున్నాను. కానీ కుదరలేదు. పెళ్లి-కెరీర్‌తో జీవితంలో సెటిల్‌ కావాల్సిన వయసు ఇది. ఇలాంటి సమయంలో ఈ విధమైన రిస్క్‌లు తీసుకోకుండా ఉండటమే మంచిది. గతంలో నేను కూడా బైక్‌ డ్రైవింగ్‌కు వెళ్లి ప్రమాదానికి గురయ్యాను. మా అమ్మ ఒట్టు వేయించుకోవడంతో ఆనాటి నుంచి బైక్స్ జోలికి పోలేదు. ఆస్పత్రికి వెళ్లి పరామర్శించాలనుకున్నాను. కాకపోతే పరిస్థితుల దృష్ట్యా అక్కడికి వెళ్లలేకపోతున్నాను. త్వరలోనే కలుస్తాను’ అని నరేశ్‌ వివరించారు.

  ఇవీ చదవండి..

  రేపిస్టులను పట్టడంలో ఆ కుక్క దిట్ట..

  ఇద్దరమ్మాయిల సహజీవనానికి అనుమతిఇస్తూ..

  తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..

  పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్