పవన్ కళ్యాణ్ కు కోవిడ్ పాజిటివ్.

    0
    340

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కరోనా భారిన పడ్డారు. స్వల్ప అస్వస్తతో హైదారబాద్‏ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. అక్కడ నిర్వహించిన కరోనా పరీక్షలలో పవన్ కళ్యాణ్‏కు కొవిడ్ పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని జనసేన టీం అదికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం పవన్ ఆరోగ్యంగానే ఉన్నారని… వైద్యులు చికిత్స అందిస్తున్నారని ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా కొరలు చాస్తోంది. ఈనెల మూడవ తేదీన తిరుపతిలో జరిగిన పాదయాత్ర, బహిరంగ సభ తర్వాత హైదరాబాద్ వెళ్లిన ఆయనకు స్వల్ప లక్షణాలు ఉన్నాయి. అప్పుడు కరోనా పరీక్షలు చేయగా నెగిటివ్ వచ్చింది. రెండురోజులక్రితం ఆయనకు కొద్దిపాటి జ్వరం, ఒళ్లునొప్పులు రావడంతో కోవిడ్ పరీక్ష చేయించుకున్నారు. ఆ ఫలితాల్లో ఆయనకు కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఆయన అప్పటి నుంచి ఫామ్ హౌస్ లోనే ఉన్నారు. అప్పుడప్పుడు ఆక్సిజన్ కూడా అందిస్తున్నారు. అపోలో హాస్పిటల్ నుంచి వైద్యుల బృందం కూడా వచ్చి ఆయనను పరీక్షించింది. అపోలో హాస్పిటల్ కు చెందిన డాక్టర్ శ్యామ్, సుబ్బారెడ్డి, పవన్ ఫామిలీ డాక్టర్ సుమన్, ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారు. చిరంజీవి కూడా పవన్ ఆరోగ్యంపై డాక్టర్లతో సంప్రదింపులు చేస్తున్నారు.

     

     

     

    ఇవీ చదవండి

    టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

    10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

    ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

    విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.